Begin typing your search above and press return to search.

'వి-మెగా పిక్చ‌ర్స్' అంత‌కు మించి దిగ‌దా?

By:  Tupaki Desk   |   29 May 2023 4:00 PM GMT
వి-మెగా పిక్చ‌ర్స్ అంత‌కు మించి దిగ‌దా?
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యూవీ క్రియేష‌న్స్ విక్ర‌మ్ రెడ్డి వి మెగా పిక్చ‌ర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ‌ని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్లో కొత్త వాళ్ల‌తో సినిమాలు చేయ‌డం..ఔత్సాహికుల్ని ప్రోత్స‌హిం చ‌డం కోసం ఈ సంస్థ స్థాపించిన‌ట్లు రామ్ చ‌ర‌ణ్ మాట‌ల సంద‌ర్భంలో అన్నారు.

కానీ మాట‌ల‌కు.. బ‌య‌ట ప‌నుల‌కు చాలా వ్య‌త్యాస‌మే క‌నిపిస్తుంద‌ని అప్పుడే విమ‌ర్శ‌లు మొదల‌య్యాయి. తొలి సినిమా ముందు అఖిల్ తో అన్నారు. అదిపోయాక నిఖిల్ వ‌చ్చాడు. చివ‌రిగా అత‌న్నే హీరోగా పెట్టుకుని తొలి సినిమా మొద‌లు పెడుతున్నారు.

చ‌ర‌ణ్‌..విక్ర‌మ్ కి తోడుగా అభిషేక్ అగ్వర్వాల్ కూడా తోడ‌వుతున్నాడు. మ‌రి ఇది చిన్న సినిమా అవుతుం దా? నిఖిల్ పాన్ ఇండియా హీరో. 'కార్తికేయ‌-2'తో అత‌నేంటే అంద‌రికీ తెలిసి పోయాడు. దీంతో ఈ సంస్థ ఎదిగిన హీరోల్ని మ‌రింత పాపుల‌ర్ చేయ‌డానికి ఏర్పాటు చేసారా? లేక కొత్త వాళ్ల‌ని పైకి లేప‌డానికా? అన్న సందేహం రాక‌మాన‌దు. టైర్-2 హీరోల‌తో సినిమాలు నిర్మించేందుకే 'వి మెగా పిక్చ‌ర్స్' ఏర్పాటైంద‌ని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ అప్పుడే అంచ‌నాకి వ‌చ్చేస్తున్నారు.

ఈ సినిమా అయిన త‌ర్వాత అకిల్ తోనో...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నో మ‌రో సినిమా అంటున్నారు. అది కూడా జ‌రిగితే వి మెగా పిక్చర్స్ ప్లానింగ్ ఏంట‌న్న‌ది ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. పేరు కొత్త వాళ్ల‌తోనూ ...సినిమాలు చేయ‌డం పాత హీరోల‌తోనా? అన్న విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌దు.

నిజానికి చ‌ర‌ణ్ బ్యాన‌ర్ ఏర్పాటు చేస్తున్నాడు అన‌గానే కొత్త వాళ్ల‌కోస‌మేన‌ని అంతా సంతోషించారు. ప్ర‌తిభావంతుల్ని గుర్తించి అవ‌కాశాలి స్తార‌ని ఆశించారు. కానీ ఇక్క‌డ కొత్త అనే టాపిక్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

దిల్ రాజు..సురేష్ బాబు లాంటి వారు త‌మ పెద్ద బ్యాన‌ర్ల‌లోనే కొత్త వాళ్ల‌కి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న సంగతి తెలిసిందే. ద‌ర్శ‌కులు..న‌టులు..సాంకేతిక నిపుణుల్ని త‌మ సంస్థ‌ల ద్వారా ఎలాంటి సిఫార్స్ లేకుండా తీసుకుంటున్నారు. అలాంటింది రామ్ చ‌ర‌ణ్ వాళ్ల‌కు మించి చేయ‌గ‌ల్గాలి. కానీ ఈ స‌న్నివేశం ప్ర‌స్తుతాన‌కైతే ద‌రిదాపుల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి వి మెగా పిక్చ‌ర్స్ లెక్క ఏంట‌న్న‌ది తెలియాలి.