Begin typing your search above and press return to search.

లైలా-మ‌జ్ను ప్రేమ‌ని వ‌ద‌ల‌ని పూరి

By:  Tupaki Desk   |   18 Jan 2022 11:30 PM GMT
లైలా-మ‌జ్ను ప్రేమ‌ని వ‌ద‌ల‌ని పూరి
X
``స‌డెన్ గా ఓ రోజు ప్రేమ‌లో ప‌డ‌తాం. ప్రేమించ‌డం మొద‌లు పెడ‌తాం. ఐల‌వ్ యూ చెబుతాం. విర‌హ‌గీతాలు రాస్తాం. ఇంట్లో వారు అడ్డుప‌డ‌తారు. చెయ్యి కోసుకుంటాం. గోడ దూకుతాం. లేచిపోతాం. చేసేదిలేక వ‌దిలేసి అంద‌రూ వెళ్లిపోతారు. మీ ఇద్ద‌రు మిగులుతారు. అది క్లైమాక్స్ అనుకుందాం. కాదు అది సీన్ నెంబ‌ర్-1. ఆ త‌ర్వాత మీ ఇద్ద‌రికీ స‌ర‌దా తీరిపోద్ది. మ‌న‌లో పుట్టే ప్రేమ అనే ఫీలింగ్ నిజం కాదు. మ‌న బాడీలో జ‌రిగే ఒక కెమిక‌ల్ రియాక్ష‌న్. దానివ‌ల్ల మ‌న‌లో ఒక యూఫోరియా కల్గుతుంది. దాన్ని మ‌నం ప‌విత్ర‌మైన ప్రేమ అనుకుంటాం. మ‌న‌లో పుట్టే స్వీట్ అండ్ వామ్ ఫీలింగ్స్ అన్నీ కెమిక‌ల్స్ కి ..హార్మోన్స్ కి పుట్టిన‌వే. ప్రేమ ఒక్క‌టే కాదు. మ‌న‌లో క‌లిగే ప్ర‌తీ ఏమోష‌న్ కి కెమిక‌ల్ రియాక్ష‌న్ కార‌ణం.

బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ మూలంగా ఇవ‌న్నీ క‌ల్గుతాయి. మ‌న బ్రెయిన్ సిరిటోరియ‌న్ రిలీజ్ చేస్తుంది. అది నిద్ర‌పోవ‌డానికి లేదా డిప్రెష‌న్ కి కార‌ణ‌మ‌వుతుంది. ఎప‌టైటిల్..అరోస‌ల్..మూడ్ కి అదే కార‌ణం. అలాగే డోప‌మైన్. దీన్ని ప్రెజ‌ర్ కెమిక‌ల్ అని పిలుస్తారు. సెక్స్ చేసినా..ఎక్స‌ర్ సైజ్ చేసినా..న‌చ్చిన ఆహారం తిన్నా హ్యాపీగా ఫీల‌వుతారు. మీలో పుట్టిన ప్ర‌తీ ప్రేమ సెక్సువ‌ల్ అట్రాక్ష‌న్ వ‌ల్ల పుట్టిందే. లైలాతో జ‌ర‌గ‌బోయే ఇంట‌ర్ కోర్స్ ని దృష్టిలో పెట్టుకుని లైలాని చూసిన‌ప్పుడ‌ల్లా మ‌జ్నుకి ఇఫోరియా క‌ల్గుతుంది. స‌డెన్ గా లైలాకి వేరేవాళ్ల‌తో పెళ్లి అయి లైలా వెళ్లిపోతుంటే లైలా-మ‌జ్నులు ఒక‌ర్ని ఒక‌రు క‌న్నీళ్ల‌తో చూసుకుంటూ అమ‌ర ప్రేమికుల్లా క‌నిపిస్తారు.

గుండె ప‌గిలిన మ‌జ్ను ప్ర‌తీ రోజు ఏడుస్తాడు. వాళ్ల ప్రేమ చూసి స్నేహితులు ఏడుస్తారు. ఈ మొత్తం అంతా డ్రామా. అదే లైలాని వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎన్నాళ్లు కాపురం చేస్తాడో తెలియ‌దు. వాడిమీద నార్కోటిక్ ప‌రీక్ష‌లు చేస్తే వేరే అమ్మాయి పేరు చెప్పొచ్చు. సైన్సు ప్రకారం స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను కొల‌వ‌డం అసాధ్యం. ఒక‌వేళ మ‌జ్నుకి డోప‌మైన్ త‌గ్గిపోతే లైలా ని మ‌ర్చిపోతాడు. పార్కిన్ స‌న్ డిసీజ్ వ‌స్తాది. దీని వ‌ల్ల అత‌ను ఎమోష‌న‌ల్ లెస్ అయిపోతాడు. చివ‌రికి ఒక యానిమేటెడ్ బొమ్మ‌లా త‌యార‌వుతాడు. వాడికి మెడిక‌ల్ గా డోప‌మైన్ ఇస్తే మ‌ళ్లీ నెమ్మ్దిగా మ‌జ్ను అయిపోతాడు. బేసిక్ గా బ్రెయిన్ ఎన్నో కెమిక‌ల్స్ మ‌ధ్య ఈదుతూ ఉంటుంది.

అదే మ‌జ్నుకి ప‌దేళ్ల వ‌య‌సులో లేని సెక్స్ కోరిక‌లు 14 ఏళ్ల వ‌య‌సులో క‌ల్గుతాయి. ఎందుకంటే అప్పుడే టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. ప్రేమ‌..మోహ‌లే కాదు. మ‌న‌లో ఎన్నో ఎమోష‌న్స్ ఫీల్ అవుతాం. ప్ర‌తీ ఏమోష‌న్ కి ర‌క‌ర‌కాల కెమిక‌ల్ రియాక్ష‌న్స్ కార‌ణం అవుతాయి. వ‌చ్చిన గొడ‌వ ఏంటంటే..మ‌న‌కి ఏ ఫీలింగ్ వ‌చ్చిన వెంట‌నే దేవుడ‌కి మెక్కేస్తాం. హ్యాపీనెస్ జీవితాంతం ఉండాల‌ని కోరుకుంటాం. సెడ్ నెస్ ఎన్నాళ్లు ఈ కష్టాలు స్వామీ అంటాం. ఫియ‌ర్ వ‌స్తే శ్రీ అంజ‌నేయం..ప్ర‌స‌న్న ఆంజ‌నేయం అంటాం. అరే ఏఫీలింగ్ వ‌చ్చినా దేవుణ్ణి పిలిచేయ‌డ‌మేనా? మ‌న‌లో క‌లిగే ప్ర‌తీ ఫీలింగ్ మాయ అని దేవుడికి తెలుసు కాబ‌ట్టే మ‌న కోరిక‌ల్ని సీరియ‌స్ గా తీసుకోడు. పిచ్చ లైట్. అందుకే ఊరికూరికే మోక్క‌కండి. ప్ర‌తీ కెమిక‌ల్ రియాక్ష‌న్ కి వ‌రాలు ఇచ్చుకుంటూ పోవ‌డానికి వాడు పిచ్చోడు కాదు.. దేవుడు`` అంటూ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ మ‌రో ఆడియోని వ‌దిలారు.