Begin typing your search above and press return to search.

రియా పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సీబీఐ...!

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:34 PM GMT
రియా పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సీబీఐ...!
X
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ సూసైడ్ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ క్రమంలో తాజాగా సీబీఐ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసింది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులైన ఇంద్రజిత్ చక్రవర్తి - సంధ్య చక్రవర్తి - షోవిక్ చక్రవర్తిలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావిస్తున్న శామ్యూల్ మరియు శ్రుతి మోదీల పై కూడా సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసింది. సుశాంత్ కేసులో బీహార్ పోలీసులు విచారణకు దిగినప్పటి నుంచి రియా మరియు ఆమె కుటుంబ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు సీబీఐ కూడా ఆమెపై ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేయడంతో రియా సీబీఐ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా సుశాంత్ మరణించిన చాలా రోజుల తర్వాత సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులుకు ఫిర్యాదు చేస్తూ.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అతని ఖాతా నుంచి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రియాతో పాటు పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టమని బీహార్ సీఎం నితీష్ కుమార్ ని కోరాడు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన చేసింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది.