Begin typing your search above and press return to search.

టీకా వ్యాక్సిన్ రానంత‌వ‌ర‌కూ ఎవ‌రికీ ధైర్యం చాలదు!

By:  Tupaki Desk   |   25 Aug 2020 4:45 AM GMT
టీకా వ్యాక్సిన్ రానంత‌వ‌ర‌కూ ఎవ‌రికీ ధైర్యం చాలదు!
X
మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు ఉధృతం అవుతుంటే .. ఊపిరాడ‌నివ్వ‌కుండా న‌లిపేస్తుంటే మ‌రోవైపు అన్ లాక్ సిద్ధాంతాన్ని వ‌ల్లిస్తోంది కేంద్రం. నాలుగైదు పాజిటివ్ కేసులు వ‌చ్చేప్పుడు టైట్ చేసి.. వేలాది కేసులు వ‌స్తుంటే చోద్యం చూస్తూ కూచోవ‌డం రివాజుగా మారింది. ఇప్ప‌టికే అన్ లాక్ 3.0 ముగుస్తోంది. అన్ లాక్ 4.0 మార్గ‌ద‌ర్శ‌కాల్ని కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇక‌పై క‌రోనాతో స‌హ‌జీవ‌నం చేయాల్సిందే. అలా చేస్తూనే షూటింగులు చేసుకోవాలి. థియేట‌ర్ల‌లో సినిమాలు ఆడించుకోవ‌చ్చ‌ని కేంద్ర స‌మాచార ప్ర‌సారాల శాఖ ఎంతో విడ్డూర‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ఓవైపు స్టార్ హీరోలు స‌హా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు బ‌తికుంటే బ‌లిసాకు తినొచ్చ‌ని అనుకుంటే.. కేంద్రం అనుమ‌తులు ఇచ్చేసింది. మ‌రి దీనిపై సినీవ‌ర్గాల అభిప్రాయం ఎలా ఉంది? అంటే..

చాలా కాలం క్రిత‌మే డి.సురేష్ బాబు లాంటి డిస్ట్రిబ్యూట‌ర్ కం ఎగ్జిబిట‌ర్ చాలా చాలా క్లారిటీగా చెప్పిన‌ది ఏమంటే వ్యాక్సిన్ కానీ టీకా కానీ రానిదే జ‌నాలు ఇల్లు వ‌దిలి థియేట‌ర్ల‌కు రారు. షూటింగులు కూడా చేయ‌రు.. అని చెప్పారు. ఇటీవ‌ల కొంద‌రు షూటింగుల‌కు వెళ్లినా కానీ తిరిగి మ‌హ‌మ్మారీ భారిన ప‌డి ఆస్ప‌త్రుల‌కు చేరుకోవ‌డం క‌ల్లోలం రేపింది.

తాజాగా తెలుగు నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. కేంద్రం అనుమ‌తులు ఇచ్చినా షూటింగుల‌కు వెళ్లేందుకు అంద‌రూ భ‌య‌ప‌డుతున్నార‌ని.. మార్గ‌ద‌ర్శ‌కాలు అనుస‌రిస్తూ షూటింగులు చేయ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పారు. టీకా కానీ వ్యాక్సిన్ కానీ రాక‌పోతే ఎవ‌రికీ ధైర్యం చాల‌ద‌ని అన్నారు. కేవ‌లం ఇది సి.క‌ళ్యాణ్ వెర్ష‌న్ మాత్ర‌మే కాదు.. చాలా మంది చెబుతున్న‌ది కూడా ఇదే. టీవీ సీరియ‌ల్ షూటింగుల‌కు డేర్ చేస్తున్నా.. చిన్నా చిత‌కా సినిమాల షూటింగులు చేస్తున్నా స్టార్లు ఎవ‌రూ ఇంకా ఇంట్లోంచి బ‌య‌టికి అడుగు పెట్ట‌నే లేదు. అందుకు ఎవ‌రికీ ధైర్యం చాల‌డం లేదు. ఇది ప‌క్కా నిజం.