ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేసేవి ఇవే..

Wed Aug 10 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Buzzing in this weekend's OTT.

శుక్రవారం సినిమా ప్రేమికులకు పండగ. థియేటర్ల వద్ద ఒకటి రెండు సినిమాలు లేదా అంతకు మించిన సినిమాలు ప్రతి వారం వస్తూనే ఉన్నాయి. ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద కు మూడు సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. థియేటర్ కు వెళ్లి సినిమా చూసే వారికి పండగ.. అంతే కాకుండా ఓటీటీ లో సినిమాలు చూసే వారికి కూడా పండగే ఈ వారం.ఈ శుక్రవారం నుండి ఓటీటీ లో పలు సినిమా లు స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ప్రథానంగా రామ్ హీరోగా నటించిన ది వారియర్ మరియు నాగ చైతన్య నటించి థాంక్యూ సినిమాలు ఈ వారంలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది.

అయినా కూడా సినిమా ను ఓటీటీ లో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థాంక్యూ సినిమా కు నెగటివ్ టాక్ వచ్చినా కూడా అక్కినేని ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ది వారియర్ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక థాంక్యూ సినిమా ను ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా తెలుగు ప్రేక్షకుల కోసం మరి కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అవి కూడా ఈ శుక్రవారం నుండి అందుబాటులోకి వచ్చి వీకెండ్ లో సందడి చేయబోతున్నాయి.

సాయి పల్లవి నటించిన గార్జి సినిమా ను సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో గార్జి ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన మాలిక్ సినిమా ను ఆహా వారు తెలుగు లో డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఇదే వారం నుంచి మాలిక్ తెలుగు లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ సేతుపతి నటించిన మహా మనిషి సినిమాను కూడా ఆహా లో ఈ వారం నుండే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ వారం లో కూడా ఓటీటీ సందడి భారీగానే ఉండబోతుంది. ఈ వీకెండ్ కి కూడా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ ను పొందవచ్చు.