టక్ డైరెక్టర్ నెక్ట్స్ ఏంటీ?

Mon Sep 13 2021 14:13:23 GMT+0530 (IST)

Buzz On shiva nirvana Upcoming Movie

నిన్నుకోరి.. మజిలీ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాన తాజాగా నానితో 'టక్ జగదీష్' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కమ్ మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల టక్ జగదీష్ అమెజాన్ ద్వారా డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన వెంటనే ప్రేక్షకులు సినిమా పై పెదవి విరిచారు. కొందరు పర్వాలేదన్నా కూడా ఎక్కువ శాతం మంది సినిమా నాని స్థాయిలో లేదని.. శివ నిర్వాన నుండి ఇలాంటి సినిమా ఆశించలేదు అంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. సినిమా నిరాశ పర్చడంతో టక్ దర్శకుడు తర్వాత ఏం చేయబోతున్నాడు అంటూ అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. టక్ జగదీష్ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా దాదాపు రెండేళ్ల క్రితమే కన్ఫర్మ్ అయ్యింది. కాని టక్ జగదీష్ నిరాశ పర్చడం వల్ల విజయ్ దేవరకొండ నిర్ణయం ఏమై ఉంటుంది అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.టక్ జగదీష్ సినిమా చిత్రీకరణ పూర్తి కాకముందే విజయ్ దేవరకొండతో సినిమా ఒప్పందం జరిగింది అని వార్తలు వచ్చాయి. పలు సందర్బాల్లో విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు శివ నిర్వానలు ఆ ప్రాజెక్ట్ గురించి ఔను అన్నట్లుగానే మాట్లాడారు. కాని ఇప్పుడు మాత్రం సినిమా పట్టాలు ఎక్కనుందా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బిజీగా ఉండటంతో పాటు తదుపరి సినిమా విషయంలో కూడా కన్ఫర్మ్ చేశాడు. కనుక శివ నిర్వానకు డేట్లు ఇచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండతో ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనుకున్న శివ నిర్వానకు డేట్లు లభించే పరిస్థితి లేకపోవడం వల్ల మరో సినిమాను యంగ్ హీరోతో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

నిన్నుకోరి లాంటి ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని శివ నిర్వాన భావిస్తున్నాడు. అలాంటి సబ్జెక్ట్ లను శివ సరిగ్గా డీల్ చేయగలడు. అందుకే ఆ సినిమా ఖచ్చితంగా ఒక మజిలీ లేదా నిన్ను కోరి మాదిరిగా సక్సెస్ అవ్వడం ఖాయం. కనుక మళ్లీ ఆయన క్రేజ్ అమాంతం పెరగడంతో పాటు యంగ్ స్టార్ హీరోలు ఆయన కు డేట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ల జాబితాలో శివ నిర్వాన పేరు టక్ జగదీష్ తో చేరుతుందని అంతా ఊహించారు. కాని ఆ సినిమా కాస్త నిరాశ పర్చడంతో శివ నిర్వాన తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో ఒక యంగ్ హీరోతో నిన్నుకోరి కథలాంటి ఒక మంచి లవ్ స్టోరీతో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. అలాగే విజయ్ దేవరకొండతో కూడా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.