Begin typing your search above and press return to search.

#NBK107 బాల‌య్య రౌడీయిజం నిజ‌మా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:34 AM GMT
#NBK107 బాల‌య్య రౌడీయిజం నిజ‌మా?
X
మ‌సాలా క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం వేరు. నిజ జీవిత క‌థ‌ల్ని ఎంచుకుని మ‌సాలాలు ద‌ట్టించ‌డం వేరు. ఈ రెండో విభాగం ఇటీవ‌ల తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతోంద‌ని ప్రూవైంది. రవితేజ హీరోగా గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన క్రాక్ విజ‌యం సాధించ‌డం వెన‌క ఫార్ములా వ‌ర్క‌వుటైంది. దీనికి కార‌ణం నిజ ఘ‌ట‌న‌ల‌కు మ‌సాలా ద‌ట్టించి తెర‌పై సినిమాటిగ్గా చూపించడంలో గోపిచంద్ మ‌లినేని స‌క్సెస‌య్యారు. ర‌వితేజ‌కు అలాగే గోపీకి కూడా పేరొచ్చింది దీంతో.

ఇప్పుడు గోపిచంద్ మ‌లినేని నంద‌మూరి కాంపౌండ్ లో అడుగుపెడుతున్నారు. న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌థ చెప్పి ఒప్పించి ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో అఖండ పూర్తి కాగానే బాలయ్య గోపీచంద్ దర్శకత్వం వహించే త‌దుప‌రి సినిమా సెట్స్ లో జాయిన‌వుతార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇంత‌కీ ఈ సినిమాలో బాల‌య్య పాత్ర ఎలా ఉంటుంది? టైటిల్ ఏమిటి? అన్న‌ది ఆరా తీస్తే.. న‌ట‌సింహాన్ని ఈసారి స‌రికొత్త‌గా ఆవిష్క‌రించేందుకు గోపిచంద్ మ‌లినేని స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ట‌. బాల‌య్య నుంచి `రౌడీయిజం`ని బ‌య‌ట‌కు తీస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రౌడీ రాంబాబు త‌ర‌హా కాన్సెప్ట్ కాబ‌ట్టి `రౌడీయిజం`ని టైటిల్ గా అనుకుంటున్నార‌ట‌. ఇందులో బాల‌య్య‌బాబుని మూడు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో చూపిస్తార‌ని కూడా టాక్ బ‌య‌ట‌కు వచ్చింది.

ఇందులో మాస్ ఎలిమెంట్స్ కి కానీ హై ఆక్టేన్ యాక్ష‌న్ సీక్వెన్స్ కి కానీ బోలెడంత స్కోప్ ఉండ‌నుంద‌ని తాజా లీకులు వెల్ల‌డిస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. అందాల త్రిష ఈ చిత్రంతో హీరోయిన్ గా తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్ట‌నుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ఇలియానా రిట‌ర్న్స్ అంటూ గుస‌గుస‌లు..?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ కోసం త్రిష లేదా ఇలియానా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని బ‌రిలో దించేందుకు ఆస్కారం ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల గోపిచంద్ మ‌లినేనికి ట‌చ్ లోనే ఉన్నారు. ఎవ‌రికి ఛాన్సివ్వాల‌నేది ఆయ‌న కోర్ట్ లోనే ఉంది బంతి. ఇక త్రిష- ఇలియానా ఏజ్ దృష్ట్యా కూడా ఆల్ట‌ర్నేట్ ఆలోచిస్తున్న ద‌శ‌లో ఉన్నారు. ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి సారిస్తున్నారు. ఇత‌ర షెడ్యూళ్ల‌ను బ‌ట్టి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు కాల్షీట్లు కేటాయించే వీలుంద‌ట‌.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. అక్టోబ‌ర్ 1న లాంచ్ అయ్యేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక అల వైకుంఠ‌పుర‌ములో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో థ‌మ‌న్ పేరు మార్మోగింది కాబ‌ట్టి బాల‌య్య‌తో మ్యూజికల్ హిట్ కావాల‌ని గోపిచంద్ ఆశిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్- ఎన్టీఆర్- ప‌వ‌న్ లాంటి స్టార్ల సినిమాల‌కు సంగీతం అందిస్తున్న థ‌మ‌న్ బాల‌య్య అఖండ‌కు సంగీతం అందిస్తున్నారు. ఆ వెంట‌నే మ‌రోసారి బాల‌య్య‌తోనే ప‌ని చేయ‌నున్నారు. థ‌మ‌న్ మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఆర్.సి 15 కి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే..