Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ : బ్యూటిఫుల్ విలేజ్ బుట్ట‌బొమ్మ‌

By:  Tupaki Desk   |   28 Jan 2023 4:25 PM GMT
ట్రైల‌ర్ టాక్ : బ్యూటిఫుల్ విలేజ్ బుట్ట‌బొమ్మ‌
X
మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ప‌లు క్రేజీ సినిమాలు ఈ మ‌ధ్య తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. మొన్న 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' 'భీమ్లానాయ‌క్‌'గానూ, నిన్న 'లూసీఫ్‌'.. 'గాడ్‌ఫాద‌ర్' గానూ తెలుగులో రీమేక్ అయిన మంచి విజ‌యాల్ని సాధించాయి. ఇదే కోవ‌లో మ‌రో మ‌ల‌యాళ మూవీ తెలుగులో రీమేక్ అవుతోంది. మ‌ల‌యాళంలో 'క‌ప్పెల‌' పేరుతో రూపొందిన ఓ రొమాంటిక్ ల‌వ్ స్టోరీని తెలుగులో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు 'బుట్ట‌బొమ్మ‌' పేరుతో రీమేక్ చేశారు.

అనిక సురేంద్ర‌న్‌, అర్జున్ దాస్, సేర్య వ‌శిష్ట కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఓ బ్యూటిఫుల్ విలేజ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ ద్వారా శౌరీ చంద్ర‌శేఖ‌ర్ టి. ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌చార చిత్రాల‌తో ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 4న సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ప్ర‌చార కార్య‌క్ర‌మాల జోరు పెంచేశారు.

ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్ ని శ‌నివారం మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ విడుద‌ల చేశారు. అర‌కు నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. తెలియ‌ని వ్య‌క్తి హీరోయిన్ కి ఫోన్ చేసే స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ మొద‌లైంది.

గొంతు బాగుంది పేరు తెలుసుకోవ‌చ్చా? అంటూ అవ‌త‌లి వ్య‌క్తి అన‌డం...'నీ ఫ్రెండా పేరేంటీ? అని 'పుష్ప‌' ఫేమ్ జ‌గ‌దీష్.. హీరోయిన్ ని అడ‌గ‌డం..సొంగ తుడుచుకో చెల్ల‌వుద్ది అంటూ హీరోయిన్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.

పిచ్చికాదు ప్రేమ .. మ‌నం వీడియో చూసి ప్రేమిస్తే వాడు రుఏడియో చూసి ప్రేమిస్తాడు' వంటి డైలాగ్ లు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. ఫోన్ లో ప‌రిచ‌య‌మైన వ్య‌క్తితో హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ‌టం.. అది మ‌రో యువ‌కుడికి న‌చ్చ‌క‌పోవ‌డంతో వీరి జివితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి? ఇంత‌కీ బుట్ట‌బొమ్మ ప్రేమ క‌థ సుఖాంత‌మైందా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్వాసం, ది ఘోస్ట్ వంటి సినిమాల్లో న‌టించిన అనిక సురేంద్ర‌న్ ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది.

పేరుకు త‌గ్గ‌ట్టే బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తున్న అనిక సురేంద్ర‌న్ గ్లామ‌ర్‌, పెర్ఫార్మెన్స్‌ ఈ మూవీకి ప్ర‌ధాన హైల‌ట్ గా నిల‌వ‌నున్నాయి. ఈ మూవీకి గ‌ణేష్ రావూరి సంభాష‌ణ‌లు , గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, న‌వీన్ నూలి ఎడిటింగ్‌, వంశీ ప‌చ్చిపులుసు సినామ‌టోగ్ర‌ఫీని అందిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.