టీవీ డిజిటల్ సంఘానికి 'పారితోషికం' ఇచ్చేస్తానన్న బుర్రా!

Mon Aug 15 2022 09:40:47 GMT+0530 (IST)

Burra that will give a 'reward' to the TV digital community!

టాలీవుడ్ కి అనుసంధానంగా బుల్లితెర రంగం రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓటీటీ నుంచి పోటీ ఉన్నా టీవీ రంగంలో వృద్ధి నమోదవుతోందే కానీ పడిపోవడం లేదు. ఇకపోతే తెలుగు టెలివిజన్ .. డిజిటల్ మీడియా రంగంపై వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగంలో రచయితలు అపారంగా ఉన్నారు. వారందరి  సంక్షేమం కోసం ఏర్పాటు చేసినదే  తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్. తాజాగా ఈ సంఘం  నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఫిలిం ఛాంబర్ హాలులో..ఆహ్లాద భరిత వాతావరణం లో ఘనంగా జరిగింది. సంఘం అభివృద్ధికి స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ చేసిన ప్రకటన స్ఫూర్తిని నింపింది.సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించగా కీలక సభ్యులంతా పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది కేవీఎల్ నరసింహారావు గారు వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం వివరాలు పరిశీలిస్తే..  బాబా ఫక్రుద్దీన్ - అధ్యక్షుడు కాగా కే నరేందర్ రెడ్డి - జనరల్ సెక్రటరీగా ఉన్నారు. డి. మహేందర్ వర్మ - ట్రెజరర్...త్యాగరాజు మలిగ-వర్కింగ్ ప్రెసిడెంట్.. ఓం ప్రకాష్ మార్త - వైస్ ప్రెసిడెంట్..శ్రీరామ్ దాత్తి -వైస్ ప్రెసిడెంట్..జే చిత్తరంజన్ దాస్ -ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.. సుహాస్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్...రాపోలు దత్తాత్రి - జాయింట్ సెక్రటరీ.. చెల్లి స్వప్న - ఆర్గనైజింగ్ సెక్రటరీ.. ఆర్. డి.ఎస్.ప్రకాష్ - ఆర్గనైజింగ్ సెక్రటరీ.. సత్య తుమ్మల -ప్రిన్సిపల్ సెక్రటరీ..మహతి -ప్రిన్సిపల్ సెక్రటరీ గా ప్రమాణ స్వీకారం చేశారు. సి. శశిబాల- డి శ్రీనివాసరాజు- ఐ సతీష్ కుమార్- కే విశ్వనాథ్-ఎం ఫణి కుమార్-  శ్రీనివాస్ వలబోజు- సాధనాల వెంకట స్వామి నాయుడు- లక్ష్మీనారాయణ శ్రీరామోజు  ఈసీ మెంబర్స్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి... టీవీ ఫెడరేషన్ లో ఉన్న 24 శాఖలు వారు కలిసికట్టుగా టీవీ నగర్ సాధించుకోవడానికి కృషి చేయాలి అన్నారు.  విశిష్ట అతిథిగా హాజరైన విజన్ వి వి కే సంస్థల అధినేత విజయ్ కుమార్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రచయితల సంఘ కార్యాలయం కోసం రూ. లక్ష రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో- గత 13 - 14 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారిని పలువురు వక్తలు అభినందించారు. నాగబాల సురేష్ గారు మాట్లాడుతూ "టీవీ నగర్ సాధించుకోవడానికి సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గ సభ్యులందరూ పట్టుదలతో కృషి చేయవలసి ఉంటుంది" అని అన్నారు. ఆయన నూతనంగా ఎన్నికైన వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సమావేశంలో టీవీ రంగం నుండి సినీ రంగానికి వెళ్లి అగ్రశ్రేణి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ.. " రచయితలు తాము నెలరోజుల్లో రాసే ఎపిసోడ్స్ లో ఒక ఎపిసోడ్ కి సంబంధించిన అమౌంట్  అసోసియేషన్ కి ఇస్తే - అసోసియేషన్ ఆర్థికంగా బలపడుతుంది. అలా వారు కనుక ఇస్తే...నేను ఏడాది కాలంలో రాసే సినిమాలలో ఒక సినిమా రెమ్యూనరేషన్ సంస్థకి విరాళంగా ఇస్తాను" అని సంచలన ప్రకటన చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ రచయితలు అక్క పెద్ది వెంకటేశ్వర శర్మ- అనంత కుమార్- శేషు కుమార్- మాడభూషి వెంకటేష్ బాబు- కాంచనపల్లి రాజేంద్ర రాజు- రవి కొలికపూడి తో పాటు.. పలువురు రచయితలు హాజరై కొత్త కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో సంస్థ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో పలు విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు.