Begin typing your search above and press return to search.

బన్నీకి ఆ ఆలోచన ఉందట కాని..!

By:  Tupaki Desk   |   19 Feb 2020 4:53 PM GMT
బన్నీకి ఆ ఆలోచన ఉందట కాని..!
X
సౌత్‌ స్టార్స్‌ ఎక్కువ శాతం బాలీవుడ్‌ లో కూడా గుర్తింపు దక్కించుకోవాలని.. బాలీవుడ్‌ లో స్టార్‌ గా మారాలని కోరుకుంటారు. హీరోయిన్స్‌ చిన్న అవకాశం వచ్చినా వెళ్తారు. కాని సౌత్‌ స్టార్‌ హీరోలు మాత్రం బాలీవుడ్‌ కోరిక ఉన్నా కూడా అక్కడకు వెళ్లేందుకు ధైర్యం చేయరు. ఒక్కరు ఇద్దరు హీరోలు అక్కడకు వెళ్లి సక్సెస్‌ అవ్వలేదు. దాంతో ఇతర హీరోలు కూడా ఆఫర్లు వచ్చినా కూడా వెళ్లేందుకు ఆసక్తిని చూపడం లేదు. తాజాగా బన్నీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.

అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న అల్లు అర్జున్‌ ఇటీవల జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ ఎంట్రీ విషయమై దాదాపు అన్ని ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్‌ లో చేయాలనే అనుకుంటున్నాను. కాని ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో ఎంట్రీ కోసం నా వద్దకు వచ్చిన ఏ కథ కూడా నన్ను ఇంప్రెస్‌ చేయలేదు.

కథ నన్ను ఇంప్రెస్‌ చేసినప్పుడు బాలీవుడ్‌ వెళ్లే విషయమై ఆలోచిస్తాను అన్నాడు. భవిష్యత్తులో హిందీలో నటిస్తానేమో చూడాలి అన్నాడు. బాలీవుడ్‌ హీరోలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.. వారికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. హిందీ సినిమా మార్కెట్‌ ఎక్కువ. కనుక అక్కడ నటించడం గౌరవంను పెంచుతుంది. కాని అందుకోసం మంచి స్క్రిప్ట్‌ కావాలని బన్నీ చెప్పుకొచ్చాడు. మరి బన్నీని ఇంప్రెస్‌ చేసే స్టోరీ ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో లేదో చూడాలి.