పాట కోసం గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చిన బన్నీ

Wed Dec 08 2021 19:01:33 GMT+0530 (IST)

Bunny giving Gold Rings as a gift for the song

చాలా మంది హీరోలు తమకు నచ్చిన వారికి లేదా తమ పనితో ఫిదా చేసిన వారికి గిఫ్ట్‌లు ఇస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఈ సంస్కృతి కేవలం కోలీవుడ్‌కి మాత్రమే పరిమితం. కానీ దాన్ని టాలీవుడ్‌లోనూ ప్రారంభించేశారు మన ఐకాన్ స్టార్ బన్నీ. ఆ మధ్య `ఆచార్య` షూటింగ్‌లో తన క్రూ సభ్యులకు కాస్ట్ లీ ఫోన్ లని సోను సూద్ బహుమతిగా ఇస్తే స్టైలిష్ స్టార్ బన్నీ అంతకు మించి విలువైన వాటిని బహుమతులుగా ఇచ్చి ఆశ్చర్యపరచడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.బన్నీ తన టీమ్ మెంబర్స్ వర్క్ కి ఫిదా అయి ఏకంగా 12 మంది టీమ్ మెంబర్స్ కి గోల్డ్ రింగ్స్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కో రింగ్ పది గ్రాములు వుంటుందని చెబుతున్నారు. 12 మందికిపది గ్రాముల ఉంగరాలని బన్నీ గిఫ్ట్‌గా ఇవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు. బన్నీ నటిస్తున్న `పుష్ప` ఈ నెల 17న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ఐటమ్ నెంబర్ పూర్తి కాలేదు. దీంతో సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు మొదలయ్యాయి.

ఆ వార్తలకు చెక్ పెడుతూ `పుష్ప` టీమ్ సమంత బన్నీలపై ఐటమ్ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో పూర్తి చేసింది. సాంగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడంలో టీమ్ మెంబర్స్ పాత్ర ఎంతో వుందట. ఈ విషయాన్ని గ్రహించిన బన్నీ టీమ్ మెంబర్స్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి బహుమతులు అందించాలనుకున్నారట. ఆ ఆలోచనని వెంటనే అమల్లోపెట్టిన బన్నీ 12 మంది టీమ్ మెంబర్స్‌కి గోల్డ్ రింగ్స్ ని బహుమతిగా ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గామారింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ప్రధాన విలన్ గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నారు.