'పుష్ప' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ

Fri Jan 28 2022 16:13:30 GMT+0530 (IST)

Bunny enjoying puspha success

అల్లు అర్జున్ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాడు. 'పుష్ప' తెచ్చిన సక్సెస్ ను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి మరిన్ని దేశాలలో ఒక రౌండ్ వేసి రావడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ ఒక సినిమాను ఒప్పుకున్నాడంటే ముందుగా తన పాత్రకి తగిన లుక్ ఉండేలా చూసుకుంటాడు. ఆ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. అలాగే 'పుష్ప' సినిమా కోసం ఆయన గెడ్డం .. మీసాలు పెంచాడు. ఇక ఈ సినిమా షూటింగు చాలాకాలం పాటు కొనసాగింది. షెడ్యూల్ కి .. షెడ్యూల్ కి మధ్య గ్యాప్ వచ్చినప్పటికీ కరోనా కారణంగా ఆయన ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి.అందువలన షూటింగు లేని సమయంలో ఆయన ఇంటిపట్టునే ఉన్నాడు. ఇక లాక్ డౌన్లు తీసేసిన తరువాత ఆయన వరుసగా షూటింగులో పాల్గొంటూ వెళ్లాడు. ఎక్కువగా మారేడుమిల్లి ఫారెస్టులో ఈ సినిమా షూటింగ్ నడిచింది. ఈ సినిమాకి ముందుగానే విడుదల తేదీ ఇచ్చేయడం వలన ఆ సమయానికి థియేటర్లలో వదలాలనే నిర్ణయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ టెన్షన్ నడుస్తూ ఉండగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో సక్సెస్ పార్టీల పేరుతో బన్నీ ఒంటిచేత్తో ఆయా నగరాలకు తిరుగుతూ థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గకుండా చూసుకున్నాడు.

ఇక మొత్తానికి ఈ సినిమా కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ భారీస్థాయిలో వసూళ్లను రాబట్టింది. పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ సినిమా స్ట్రైట్ సినిమాలకు మించిన వసూళ్లను రాబట్టడం విశేషం. ఇలా ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడం .. బన్నీ మార్కెట్ ను మరింతగా పెంచేయడం జరిగిపోయింది. దాంతో ఇప్పుడు బన్నీ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఈ సక్సెస్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ వీధుల్లో విహరిస్తున్నాడు. మరిన్ని దేశాలను చుట్టబెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

త్వరలో 'పుష్ప 2' సినిమా షూటింగు మొదలు కానుంది. మొదటి భాగానికి మించిన రిస్క్ చేయనున్నట్టు సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. అందువలన ఒక దీక్షతో ఈ సినిమాను బన్నీ పూర్తిచేయనున్నాడు. ఆ వెంటనే బోయపాటి ప్రాజెక్టును కూడా చేయనున్నాడు. అందువలన సమయం కుదరక పోవచ్చనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడే సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ వేస్తున్నాడన్న మాట