Begin typing your search above and press return to search.

`గామి` టీజర్ పై బ‌న్ని ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   22 Oct 2021 9:32 AM GMT
`గామి` టీజర్ పై బ‌న్ని ప్ర‌శంస‌లు
X
విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ప‌లువురు ప్ర‌తిభావంతులైన‌ స్టార్ల‌ను అల్లు అర్జున్ ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో ప్ర‌తిభావంతుడు విశ్వ‌క్ సేన్ కి బ‌న్ని నుంచి స‌పోర్ట్ ద‌క్కుతోంది.
యువ నటులు విశ్వక్ సేన్ - చాందిని చౌదరి జంట‌గా న‌టించిన `గామి` ప్రకటన టీజర్ ఇటీవ‌లే విడుదలైంది. ఈ టీజ‌ర్ పై ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదిక‌గా టీజర్ స‌హా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

`గామి` టైటిల్ ప్రకటన ఆస‌క్తిని రేకెత్తించింద‌ని.. మొత్తం బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని బ‌న్ని అన్నారు. టీమ్ లో చాలా మంది యువకులు ఫ్రెష్ లుక్ తో ఉన్నారు. ఇండ‌స్ట్రీలో న‌వ‌త‌రం నిర్మాతలు పెరగడం చూసి నిజంగా చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలనే వారి అభిరుచిని.. UV క్రియేషన్స్ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను`` అని ట్వీట్ చేశారు.

కొత్త కుర్రాడు విద్యాధర్ కాగిత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ విభాగం ఈ చిత్రాన్ని సమర్ప‌ణ‌లో వి- సెల్యూలాయిడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ త‌ర్వాత మ‌రో చ‌క్క‌ని విజ‌యం కోసం వేచి చూస్తున్న విశ్వ‌క్ కి గామి రూపంలో మ‌రో హిట్టు ద‌క్క‌నుందేమో చూడాలి. బ‌న్ని ప్ర‌మోష‌న్ ఈ మూవీకి పెద్ద ప్ల‌స్ కానుంది.