Begin typing your search above and press return to search.

సరిగ్గా రిలీజ్ వేళ.. బన్నీ వాసు భలేగా ఓపెన్ అయ్యారుగా?

By:  Tupaki Desk   |   14 Oct 2021 1:30 PM GMT
సరిగ్గా రిలీజ్ వేళ.. బన్నీ వాసు భలేగా ఓపెన్ అయ్యారుగా?
X
మెగా కాంపౌండ్ కు చెందిన నిర్మాతల్లో బన్నీ వాసు ఒకరు. బన్నీకి అత్యంత సన్నిహితుడైన ఆయన మెగా ఫ్యామిలీకి వీర విధేయుడిగా చెబుతారు. తాజాగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ దసరా వేళ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్.. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు.

ఇవన్నీ చాలా సందర్భాల్లో చదివిన సమాచారమే అయి ఉంటుంది. కానీ.. ఇప్పుడు చెప్పే విషయాలన్ని మాత్రం చాలా తాజా కబుర్లు. ఇటీవల కాలంలో మరే నిర్మాత నోటి నుంచి రాని కొత్త విషయాన్ని తాజాగా బన్నీ వాసు నోటి నుంచి వచ్చాయి. తన సినిమా రిలీజ్ కు కాస్త ముందుగా.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే.. నిర్మాత అన్న తర్వాత ఆ మాత్రం రాజీ లేకుంటే.. బిజినెస్ దెబ్బడిపోతుందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఇంతకూ బన్నీ వాసు ఏం చెప్పరన్నది చూస్తే.. జాతిరత్నాల్లాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి.

ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచి కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఇండస్ట్రీ కారణంగా ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి.. మాకు ఏమైనా చేసి పెట్టండని ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆన్ లైన్ టికెటింగ్ అంశంపై ఏపీ ప్రభుత్వ విధానాన్ని సింఫుల్ గా.. చాలా తేలిగ్గా తేల్చేశారు. ఆన్ లన్ టికెటింగ్ దాదాపుగా ప్రతి థియేటర్ లో రన్ అవుతుందని.. ప్రేక్షకులు ఎన్ని టికెట్లు తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ఏపీ ప్రభుత్వం అడుగుతోందన్నారు.

ఎగ్జిబిటర్స్ లో చాలామంది పన్నులు కట్టటం లేదని. దాదాపు 300 థియేటర్లు జీఎస్టీ పరిధిలో లేవన్న సంచలన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. చాలామంది ఎగ్జిబిటర్లు టాక్స్ పరిధిలోకి కూడా రావటం లేదన్నారు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించటం లేదన్నది ప్రభుత్వ భావన అని.. వారు పారదర్శకత కోరుకుంటున్నారన్నారు.

ఆన్ లైన్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వం వారు తీసుకుంటారే ప్రచారం జరుగుతోందని కానీ అందులో నిజం లేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రిపోర్టు తయారు చేయాలన్నారని.. అది వచ్చాక నిర్ణయాలు పరిశ్రమకు సానుకూలంగా ఉంటాయన్ననమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏమైనాసినిమా విడుదలకు ముందు బన్నీ వాసు నోటి నుంచి వచ్చిన వాస్తవాలు చూస్తే.. ఆయన వ్యాపార తెలివికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.