ఒకరికోసం ఒకరిగా ఐక్యమైన ఆదర్శ జంట

Tue Sep 29 2020 18:30:12 GMT+0530 (IST)

Bunny Sneha Friendly Couple

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి జంట టాలీవుడ్ ఆదర్శదంపతులుగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. వారసులు అల్లు అయాన్.. అల్లు అర్హ శరవేగంగానే ఎదిగేస్తున్నారు. ఇక భార్యభర్తల మధ్య అన్యోన్యతకు ఈ జంటనే చూపిస్తారు సినీవర్గాల్లో. ఒకరికోసం ఒకరిగా ఐక్యం అయిన జంట అని చెబుతారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో టైమ్ స్పెండ్ చేసేందుకు బన్ని ఎంతో ఆసక్తిగా ఉంటారు.మంగళవారం స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు అర్ధరాత్రి నుండి ప్రారంభమయ్యాయి. బన్నీ తన స్నేహితులకు చిన్నపాటి విందును ఏర్పాటు చేశారట. తాజాగా స్నేహ కేక్ కత్తిరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ కూడా కేక్ కటింగ్ ఫోటోని పోస్ట్ చేసి ఇలా తన ప్రేమను కురిపించాడు. “నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తికి ఈరోజు చాలా సంతోషకరమైన విషయాలెన్నో. నీతో ఎక్కువ పుట్టినరోజులు గడపాలని కోరుకుంటున్నాను. బి-డే శుభాకాంక్షలు`` అని తెలిపారు.

బన్ని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇక క్వారంటైన్ సమయంలో భార్య.. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం స్పెండ్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో బన్ని- స్నేహ జంట జాగింగ్ దృశ్యాలు ఇంతకుముందై వైరల్ అయ్యాయి. స్నేహా అర్జున్ కి తుపాకి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.