చిట్టిబాబును మించి అల బంటు

Sat Feb 22 2020 10:25:57 GMT+0530 (IST)

Bunny New Look In AA20

అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. అలాగే కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ ను కూడా బన్నీ దక్కించుకున్నాడు. ఈ సమయంలో బన్నీ తదుపరి చిత్రం సాదా సీదాగా ఉంటే ప్రేక్షకులు నిరుత్సాహపడతారు. అందుకే అంతకు మించి ఉండేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రం ఉండబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో బన్నీ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడనే విషయం కూడా తెల్సిందే.గతంలో ఆ పాత్ర కోసం ఒక లుక్ ను అనుకున్నారు. కాని అల వైకుంఠపురంలో చిత్రం వచ్చిన తర్వాత సినిమా సక్సెస్ తో బన్నీపై మరింత భరోసాను ప్రేక్షకులు చూపిస్తున్నారు. అందుకే లుక్ మరింత విభిన్నంగా ఉండాలనే నిర్ణయానికి బన్నీ వచ్చాడు. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని సినిమా కోసం విభిన్నమైన లుక్ ను ట్రై చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు తరహాలో బన్నీని కూడా చూపించాలని మొదట సుకుమార్ అనుకున్నాడు.

బన్నీ మాత్రం చిట్టిబాబు పాత్రను మించి మరింత మాస్ గా పాత్ర చాలా సహజం గా కనిపించేలా గడ్డం.. జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే బరువు విషయంలో కూడా కాస్త శ్రద్ద పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. రెడ్ సాండిల్ స్మగ్లింగ్ లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని... ఆ పాత్రకు తగ్గట్లుగా ఉండేందుకు బన్నీ ఏకంగా రెండు నెలల పాటు కష్టపడబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని బన్నీ లుక్ ను రివీల్ చేయడం లేదు. ఇప్పటికే బన్నీ బయటకు వెళ్తే క్యాప్ పెట్టుకుని వస్తున్నాడు. మరికొన్ని రోజుల పాటు బన్నీ బయట కనిపించక పోవచ్చు అంటున్నారు.

సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు. వచ్చే నెల నుండి తదుపరి షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సినిమాను ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ ఏడాదిలో సాధ్యం కాకుంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జనవరి మొత్తాన్ని కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఆక్యుపై చేసేసింది.