బన్నీ గెస్ట్ బాలయ్య... మెగాస్టార్ కి జూనియర్... ?

Sat Dec 04 2021 07:00:01 GMT+0530 (IST)

Bunny Guest Balayya Junior Guest Megastar

టాలీవుడ్ లో ఎన్నడూ చూడని కాంబోలు ఇపుడు కనిపిస్తున్నాయి. తన పనేదో తానేదో ఉండే బాలయ్య ఆహా ఓటీటీ ద్వారా హోస్ట్ అవతారం ఎత్తడంతోనే టాలీవుడ్ లో సీన్ మొత్తం మారిపోయింది. ఇక బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడమే అతి పెద్ద విశేషంగా అంతా చెప్పుకున్నారు. అక్కడికి వచ్చిన బన్నీ జై బాలయ్య అంటూ నినదించడం ఇంకా పెద్ద విషయంగా అంతా చెప్పుకున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ల లెక్కలే మారిపోతున్నాయి. కొత్త కాంబోలతో కళ కట్టించాలని మేకర్స్ తాపత్రయపడుతున్నారు.ఇప్పటిదాకా రొటీన్ గెస్టులతోనే కధ నడిపిన వారంతా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తోనే వండర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాని వల్ల ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా కలసి వస్తారని తమ సినిమా మీద సర్వత్రా ఆసక్తి పెరగడమే కాకుండా కలెక్షన్ల మీద కూడా ఆ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని భావిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో లేటెస్ట్ సీన్ ఎన్నడూ కలవని నందమూరి మెగా కాంపౌండ్ హీరోలు కలసిపోతున్నారు. అల్లు ఫ్యామిలీతో బాలయ్య బాగానే అల్లుకుపోతున్నాడు.

ఇదే క్రమంలో ఇపుడు మరిన్ని ఇంటరెస్టింగ్ వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ మూవీ పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య గెస్ట్ గా వస్తాడు అన్న టాక్ ఇపుడు హాట్ హాట్ గా సాగుతోంది. తన సినిమాకు వచ్చి బన్నీ చేసిన హుషార్ కి తాను బదులు తీర్చుకోవాలను బాలయ్య భావిస్తున్నాడుట. అల్లు ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో చీఫ్ గెస్ట్ బాలయ్య అయితే ఆ సందడే వేరే లెవెల్ అంటున్నారు. ఇదిలా ఉంటే మరో న్యూస్ కూడా అదే స్థాయిలో చక్కర్లు కొడుతోందిపుడు.

మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలసి నటించిన ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా తొందరలో నిర్వహిస్తారు అంటున్నారు. దానికి జూనియర్ ఎన్టీయార్ ని గెస్ట్ గా పిలవాలని భావిస్తున్నారుట. చెర్రీ జూనియర్ ట్రిపుల్ ఆర్ మూవీతో అన్నదమ్ములుగా మారిపోయారు. మెగా కాంపౌండ్ జూనియర్ కి పూర్తిగా ప్రేమాభిమానాలు కురిపిస్తోంది. దాంతో రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీకి జూనియర్ రావడం అంటే విశేషంగా అనుకోవాల్సింది లేదు కానీ అక్కడ మెగాస్టార్ కూడా ఉంటారు కాబట్టి ఈ కలయిక వేదిక మీద చూసినా రెండు ఫ్యామిలీస్ కి చెందిన ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజం కావాలని తాము అభిమానించే స్టార్లు అంతా ఒక చోటకు చేరి చిరునవ్వులు చిందిందాలని ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకుంటున్నారు.

TAGS: Acharya