భారతీయుడు 2కి బ్రేకులా?

Mon Feb 18 2019 20:00:01 GMT+0530 (IST)

Budget Restrictions for Shankar Indian 2 Movie

కొద్దిరోజుల క్రితం ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టిన భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2కి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యిందని టాక్. దీన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ బడ్జెట్ విషయంలో ఎంతవుతుందో  స్పష్టంగా చెప్పి ముందే అగ్రిమెంట్ చేయమని కోరడంతో అలా చేయలేనని శంకర్ అన్నట్టు టాక్. అది తన చేతుల్లో లేదని స్క్రిప్ట్ డిమాండ్ మేరకు అనూహ్యమైన ఖర్చులే ఎక్కువగా ఉంటాయని దానికి సిద్ధపడితేనే ఇది తీయగలమని ఒప్పించే ప్రయత్నం చేసాడట. అయితే లైకా సంస్థ మాత్రం దీనికి సంసిద్ధంగా లేదని వార్త. కారణం లేకపోలేదు.రజనికాంత్ 2.0 తీస్తున్నంత కాలం బడ్జెట్ ఎంత అవుట్ అఫ్ కంట్రోల్ అయినప్పటికీ లైకా సంస్థ ఇస్తూనే పోయింది. అయితే విడుదలయ్యాక మాత్రం సీన్ తేడా కొట్టేసింది. కమర్షియల్ లెక్కల్లో తమిళ్ లో డిజాస్టర్ కాగా తెలుగులో సైతం 25 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. నార్త్ లో కొంచెం బెటర్ గా ఆడబట్టి సరిపోయింది  కానీ లేదంటే ఇంకా దారుణంగా ఉండేది. అందుకే ఇండియన్ 2 విషయంలో అలాంటి రిస్క్ చేసేందుకు లైకా సిద్ధంగా లేదట. ఈ క్రమంలో ఇది ముందుకు వెళ్లడం అనుమానమే అని చెన్నై రిపోర్ట్.

కాస్టింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడమే ఆలస్యం. కాజల్ అగర్వాల్ కు ప్రత్యేకంగా మేకప్ టెస్ట్ కూడా చేశారు. విలన్ కోసం వేట కొనసాగుతుండగానే కథలో ఈ మలుపు వచ్చి పడింది. గతంలో ఇది తీయాలని దిల్ రాజు కమిటయ్యి ఇదే కారణంతో తర్వాత డ్రాప్ అయ్యారు. కమల్ హాసన్ కు ఇప్పుడు విజయ్ అజిత్ ల స్థాయిలో మార్కెట్ లేదు. అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ మరీ ఆ రేంజ్ లో వసూళ్లు ఇచ్చే టైపు కాదు. ఈ లెక్కల నేపథ్యంలో ఇండియన్ 2 ముందడుగు వేస్తాడా లేక ఆగిపోతాడా వేచి చూద్దాం