Begin typing your search above and press return to search.

స్టార్‌ కమెడియన్‌ ఇంట హత్య.. అయిదుగురు అరెస్ట్‌

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 AM GMT
స్టార్‌ కమెడియన్‌ ఇంట హత్య.. అయిదుగురు అరెస్ట్‌
X
తమిళ స్టార్‌ కమెడియన్‌ కమ్‌ హీరో అయిన సంతానం కుటుంబంలో విషాదం నెలకొంది. సంతానం కుటుంబంకు దగ్గర బంధువు అయిన జయ భారతీ హత్యకు గురయ్యింది. మొదట యాక్సిడెంట్ అనుకున్నా కూడా ఆ తర్వాత పరిణామాలు గమనిస్తే హత్యగా వెళ్లడయ్యింది. సంతానం కుటుంబ సభ్యులు జయ భారతీ ది హత్యగా అనుమానిస్తూ కేసు పెట్టడంతో పోలీసులు ఎంక్వౌరీ చేసి అసలు విషయాలను రాబట్టారు. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేసిన పోలీసులకు ఆమె భర్తే ఆమెను హత్య చేయించాడని తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... జయభారతికి కొన్నాళ్ల క్రితం అమెరికాలో సెటిల్డ్ అయిన విష్ణు ప్రకాష్ అనే ఇంజనీర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొన్నాళ్లకే ఇద్దరి మద్య విభేదాలు రావడంతో విడిపోయారు. జయభారతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఈ సమయంలోనే జయ భారతి కోర్టును ఆశ్రయించింది. గృహ హింస కేసు పెట్టడం తో పాటు బెదిరింపులు మరియు వేదింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జయ భారతి ఫిర్యాదుతో అమెరికాలో ఉన్న విష్ణు ప్రకాష్ ఉద్యోగంకు ఇబ్బంది మొదలు అయ్యింది. దాంతో ఆమెను ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశ్యంతో యాక్సిడెంట్‌ ను ప్లాన్‌ చేశారు.

ఇటీవల ప్రైవేట్ కంపెనీలో జాబ్‌ చేస్తున్న జయ భారతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా బ్యాంకుకు క్యాష్ తీసుకు వెళ్లే వాహనంతో ఆమెను ఢీ కొట్టారు. మొదట ఆమె కింద పడగా ఆ తర్వాత వాహనంతో ఆమెను తొక్కించినట్లుగా నింధితులు ఒప్పుకున్నారు. విష్ణు ప్రకాష్ చెప్పడం వల్లే తాము ఆమెను చంపినట్లుగా నింధితులు పోలీసుల విచారణలో తెలియజేశారు. దాంతో అమెరికాలో ఉన్న విష్ణు ప్రకాష్‌ ను ఇండియా రప్పించేందుకు పోలీసులు ఎంబస్సీ తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.