Begin typing your search above and press return to search.

మమ్మీ గారి బికినీ ట్రీట్ ఫ‌సాక్

By:  Tupaki Desk   |   18 Feb 2020 11:30 AM GMT
మమ్మీ గారి బికినీ ట్రీట్ ఫ‌సాక్
X
ఐదు నెల‌ల ప‌సికందుతో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి సిద్ధ‌మైన‌ మ‌మ్మీ గారి వేషం ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రా కాంప్లేన్ మ‌మ్మీ? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి. పేరు బ్రూనా అబ్దుల్లా. టాప్ మోడ‌ల్ కం క‌థానాయిక‌గా సుప‌రిచితం. మాజీ మిస్ గానూ పాపుల‌ర్. ఇంత‌కుముందు అల‌న్ ఫ్రేజ్ అనే విదేశీని పెళ్లాడిన బ్రూనాకు 5 నెలల ప‌సికందు ఉంది. ఇసాబెల్లా అనేది బేబి గాళ్ పేరు. అయితే ఆ బేబీని తొలిసారిగా బీచ్ సందర్శనకు తీసుకుని వెళ్లింది. భ‌ర్త .. కిడ్ తో పాటు బ్రూనా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని ఇదిగో ఇలా అంత‌ర్జాలం లో షేర్ చేసింది.

ఇటీవలి కుటంబ స‌మేతంగా సెలవుల్ని ఎంజాయ్ చేసేందుకు బ్రెజిల్ బీచ్ ల‌కు వెళ్లిన బ్రూనా.. స్నీక్ పీక్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. బ్రూనా తన కుమార్తె ఇసాబెల్లా .. భర్త అలన్ ఫ్రేజ్ లతో ఎంజాయ్ చేస్తున్న ఈ ఫోటోల్లో త‌న బికినీ హైలైట్ గా నిలిచింది. బీచ్ లో తన కుమార్తె మొదటి రోజు సెల‌బ్రేష‌న్ అంటూ అస‌లు విష‌యాన్ని ఈ సంద‌ర్భం గా అభిమానులకు తెలిపింది.

బ్రూనా బాలీవుడ్ కెరీర్ ప్ర‌స్తుతం ఖాళీనే. ఇంత‌కుముందు క్రేజీగా `దేశీ బాయ్స్` లో అక్షయ్ కుమార్ తో క‌లిసి `సుబా హొన్ నా దే` అనే ఐటమ్ సాంగ్ లో న‌ర్తించింది. 2019 సెప్టెంబర్ లో ఇసాబెల్లాకు జన్మనిచ్చాక సినిమాల‌కు కామా పెట్టేసింది. ఇక ఫ్యాన్స్ కోసం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోల్ని రెగ్యుల‌ర్ గా ఇలా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తోంది బ్రూనా.