Begin typing your search above and press return to search.

#బ్రీథ్ లెస్ ట్యాలెంట్.. మహిళా గాయని రేర్ ఫీట్

By:  Tupaki Desk   |   26 Nov 2020 7:15 AM GMT
#బ్రీథ్ లెస్ ట్యాలెంట్.. మహిళా గాయని రేర్ ఫీట్
X
ఊపిరి తీసుకునేందుకు గ్యాప్ ఇవ్వ‌కుండా కొన్ని నిమిషాల పాటు పాడుతూనే ఉంటే.. అది అరుదైన ఫీట్ అనే చెప్పాలి. ప్రఖ్యాత నేప‌థ్య‌ గాయకులు శంకర్ మహాదేవన్.. లెజండరీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంతకుముందు బ్రీథ్ లెస్ ఫీట్ వేశారు. ఊపిరి లేకుండా నిమిషాల పాటు పాట పాడి సంచ‌ల‌నాల‌కు తెర తీసారు.

ఇప్పుడు అలాంటి ఫీట్ తో అద‌ర‌గొడుతోంది మ‌హిళా గాయ‌ని శ్వేతా మోహన్. ‘సీతాయనం’ కోసం బ్రీథ్ లెస్ పాట‌ను పాడారు. `మనసు పాలికే...` అంటూ సాగే పాట‌ను స‌ద‌రు యువ‌గాయ‌ని బ్రీథ్ లెస్ స్టైల్లో ఆల‌పించారు. ఈ మనోహరమైన గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఊపిరి పీల్చుకోవడం .. చరణం పాడటం ఎటువంటి విరామం లేకుండా నేర్చుతో పాడ‌టం అంటే అది చాలా కష్టతరమైన నిపుణ‌త్వం. అయినా శ్వేత మోహన్ `మనసు పాలికే` గీతాన్ని ఎంతో చ‌క్క‌గా ఆల‌పించారు. పద్మనాభ్ భరద్వాజ్ కూర్పు స‌మ‌కుదిరింది. అందాల రష్మిక మంద‌న్న కొద్దిసేపటి క్రితం ఈ పాటను విడుదల చేసింది.

సీతాయ‌నంలో కన్నడ నటుడు అక్షిత్ శివకుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రభాకర్ అరిపాక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లలిత రాజ్యలక్ష్మి దీనిని నిర్మిస్తున్నారు.