ఎక్స్ క్లూజివ్: బ్రేకీవెనే కాలేదు.. అప్పుడే రికార్డులా?

Sat Jan 18 2020 12:11:37 GMT+0530 (IST)

Break Even Chances for Sarileru Neekevvaru and ala Vaikunthapurramloo

డల్లుగా ఉన్న బాక్స్ ఆఫీసుకు డిసెంబర్ లో 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు కాస్త ఊపు తెప్పించాయి. ఇక సంక్రాంతి సినిమాలు ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కు మంట పెట్టాయి.  అదనపు షోలు.. టికెట్ల రేట్ పెంపు ఇలా అన్ని రకాల ట్రిక్కులతో థియేటర్లు కళకళలాడేలా చేశాయి.  ఎప్పటిలాగానే ఈసారి కూడా పెద్ద స్టార్లు సంక్రాంతి సమరంలో తమ సత్తా చాటారు. మొదటి వీకెండ్ లో అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ తో భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి..  పండగ వాతావరణం వచ్చేసింది.అయితే ఈ ఊపు కాస్త ఎక్కువైపోయి పోటీలో తప్పుడు కలెక్షన్  ఫిగర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. సినిమాలు విడుదలై వారం కూడా కాలేదు అప్పుడే నాన్- బాహుబలి రికార్డులు బద్దలు కొట్టామని.. బ్రేక్ ఈవెన్ అయిందని ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రాధాన పోటీదారులైన 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' టీమ్స్ ఇలా చేయడంతో రియల్ కలెక్షన్స్ ఎంత అనేది అర్థం కాకుండా పోయింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చెయ్యలేదు. మరో రెండు రోజుల్లో చాలా ఏరియాలకు బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ అవుతుందని అంటున్నారు.  'సరిలేరు నీకెవ్వరు' కంటే 'అల వైకుంఠపురములో' ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారి సమాచారం. ఎందుకంటే 'సరిలేరు నీకెవ్వరు' ఎక్కువ రేట్లకు అమ్మారు.  

ఇక నాన్ బాహుబలి రికార్డులను ఈ రెండు సినిమాలు బ్రేక్ చెయ్యలేదు.. అందుబాటులో ఉన్న థియేటర్లను రెండు సినిమాలు పంచుకోవాల్సి రావడమే అందుకు ముఖ్య కారణం.  సోలోగా రిలీజై..  వారం రోజులు దుమ్ము దులిపితేనే ఏ సినిమాకైనా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది.  ఇప్పుడు ఈ రెండు సినిమాలు అలాంటి అవకాశం దక్కలేదు.  నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చెయ్యాలంటే మరో వారం పాటు ఈ సినిమాలు ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది.