Begin typing your search above and press return to search.

బ్రహ్మాజీ గుమ్మడి రూమ్ మెట్ అంట

By:  Tupaki Desk   |   15 Sep 2019 11:22 AM GMT
బ్రహ్మాజీ గుమ్మడి రూమ్ మెట్ అంట
X
ఏదైనా సినిమా ఈవెంట్ కి నటుడు బ్రహ్మాజీ ఎటెండ్ అయితే పాపం అందరూ అతని వయసు చెప్తూ ఆడుకుంటారు. యాంకర్ సుమ అయితే బ్రహ్మాజీని స్టేజి పైకి పిలవడం దగ్గర నుండి స్టేజి విడిచి కిందకి వచ్చే వరకూ ఆట పట్టిస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా బ్రహ్మాజీ కూడా వారితో సరదాగా సెటైర్స్ వేయించుకుంటుంటాడు కూడా. వీళ్ళ కామెడీ ఆ ఈవెంట్ కి వచ్చిన వారిని భలే నవ్విస్తుంది.

తాజాగా కమెడియన్ అలీ ఓ వేదికపై బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ కామెడీ పండించాడు. పేదలు పూజ్యులు బ్రహ్మాజీ గారికి అంటూ స్పీచ్ ప్రారంభించి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే ఆయన చాలా సినిమాలు చేసే వారు. ఎవరో గుమ్మడి గారి రూమ్ మెట్ అని కూడా చెప్పారు. అంటూ బ్రహ్మాజీ ని ఆటపట్టించాడు. అంతే కాదు చివర్లో బ్రహ్మాజీ గారు మీ సంపాదన ఎలా ఉంటుంది ..? ఏం కొంటుంటారు అంటే ఏం లేదు సంపాదన అంతా జుట్టుకి రంగు వేయడానికే అయిపోతుంది అన్నారని నవ్వుతూ చెప్పాడు. ఇక అలీ కామెడీ కి స్టేజి మీద ఉన్న వారితో పాటు మిగతా వారందరూ కూడా సరదాగా నవ్వుకున్నారు.

ఇక బ్రహ్మాజీ కూడా నేనేమైన తక్కువ తిన్నానా అనుకోని అలీ పై కామెడీ చేసాడు. నేను ముందుసారి చెన్నై వెళ్ళినప్పుడు అలీ దగ్గరే మొదటి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అప్పటికే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఆంద్ర నుంచి వచ్చాను అని చెప్పగానే ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పాటు ఆశిస్సులు కూడా అందించారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో మీ ముందున్నానంటే దానికి అలీ యే కారణం అంటూ కామెడీ పంచ్ వేసాడు. వీరిద్దరి కామెడీ ఈవెంట్ కె హైలైట్ అయింది.