బోయపాటి ఈ సారి కసిగా కొట్టాడుగా

Tue Dec 07 2021 22:00:01 GMT+0530 (IST)

Boyapati gave a strong reply with Akhanda

సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ అందరి జాతకాలు ప్రతీ శుక్రవారం మారుతుంటాయి. కొంత మంది జీవితాలు సముద్రపు కెరటాల్లా పడుతుంటాయి... రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ లేస్తుంటాయి.అయితే ఇక్కడ పట్టుదల కసి వుంటే పడిన జీవితాలు మళ్లీ ఉప్పొంగె కెరటంలా ఓ ఉప్పెనలా పైకి లేవడం అన్నది మాత్రం గ్యారెంటీ. ఇదే ఊరమాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను విషయంలో అక్షర సత్యమైంది.

తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం `అఖండ` బాక్సాఫీస్ వద్ద శివ తాండవం చేస్తోంది. బాలయ్య కెరీర్ లోనే కనీ వినీ ఎరుగని కలెక్షన్ ల వర్షం కురినిస్తోంది.

బాలయ్యకు కొన్ని సినిమాలు యుఎస్ మార్కెట్‌లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. కానీ డిసెంబర్ 2న విడుదలైన `అఖండ` అక్కడి థియేటర్లలో అఖండమైన విజాయాన్ని సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ దుమ్ము దులిపేస్తోంది.

కారణం బోయపాటి శ్రీను ఎంచుకున్న కథ బాలయ్య పాత్రలని తీర్చి దిద్దిన తీరు అంతకు మించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలపాలన్న ఆయన కసి కనిపించింది.

ఎందుకంటే ఈ సినిమాకి ముందు బోయపాటి శ్రీను `వినయ విధేయ రామ` చిత్రాన్ని తెరకెక్కించారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల తొలి కలయికలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా దారుణంగా హర్ట్ అయ్యారు.

ఈ చిత్రం కోసం రామ్ చరణ్ వివేక్ ఓబెరాయ్ పాల్గొనగా అజార్ బైజాన్ లో చిత్రీకరించిన ఫైట్ ని ట్రోల్ చేస్తూ రామ్‌చరణ్ బ్యాటింగ్ గద్దల ఫీల్డింగ్ అంటూ విమర్శలు గుప్పించారు.

దీంతో ఈ సారి కసిగానే కొట్టాలని ఫిక్సయిన బోయపాటి `అఖండ`కు ఎన్ని అవాంతరాలు అడ్డొచ్చినా లేక్క చేయకుండా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవాలన్నకసితో పని చేశారు.

తను ఏ నమ్మకంతో అయితే `అఖండ`ని తెరకెక్కించాడో అదే నమ్మకాన్ని ఈ రోజు ప్రేక్షకులు నిజం చేసి సినిమా పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని అందించారు.

సినిమాలో హిందుత్వన్ని చూపించిన తీరు బాలకృష్ణ పాత్రలని మలిచిన విధానం పక్షకుల్ని రోమాంచితుల్ని చేస్తోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు తనపై వచ్చిన విమర్శలకు బోయపాటి ఈ సారి కసిగా దెబ్బకొట్టాడని కామెంట్ లు చేస్తున్నారు. సినిమా సాధిస్తున్న కలెక్షన్ లని ఓ రేంజ్ లో పొగిడేస్తూ బాలయ్య ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు.