Begin typing your search above and press return to search.

రౌడీతో ఊర మాస్ డైరెక్టర్..? వర్కౌట్ అవుతుందా...?

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:30 AM GMT
రౌడీతో ఊర మాస్ డైరెక్టర్..? వర్కౌట్ అవుతుందా...?
X
టాలీవుడ్ లో మ‌రో ఊహించని కాంబినేష‌న్‌ కి రంగం సిద్ధం అవుతోందని రూమర్స్ వస్తున్నాయి. సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో కెరీర్ పై ద్రుష్టి పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్.. వరుసగా స్టార్ డైరెక్టర్లని లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అలానే శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

దిల్ రాజు బ్యాన‌ర్ లో బోయపాటి శ్రీను 'భద్ర' సినిమా చేసిన తరువాత మరో మూవీ చేయలేదు. అయితే ఇప్పటికే బోయ‌పాటి శ్రీ‌ను దిల్ రాజుతో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడట. అంతేకాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండకి ఓ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు అడ్వాన్సులు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఈ ఇద్ద‌రి కాంబోలో దిల్ రాజు ఓ సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. నిజానికి ఇంద్రగంటి మోహనకృష్ణ - విజ‌య్ కాంబోలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేసాడు. అయితే 'వి' రిజల్ట్ తర్వాత అది హోల్డ్ లో పెట్టి ఇప్పుడు బోయపాటి శ్రీను - విజయ్ కాంబోలో సినిమా చేయనున్నాడట. బోయపాటి అంటే మాస్‌ యాక్ష‌న్ సినిమాలే ఉంటాయి. విజయ్ ఇప్పటి వరకు అలాంటి సినిమా చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ రూమర్ నిజమై వీరి కలయికలో సినిమా వచ్చినా అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనేది ప్రశ్నార్థకమే. బోయపాటి శ్రీను ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు విజయ్ చేతిలోనూ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ కాంబో లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.