బాలయ్య .. బన్నీ నాకు లైఫ్ ఇచ్చారు: బోయపాటి

Sun Nov 28 2021 10:05:40 GMT+0530 (IST)

Boyapati Srinu In Akhanda Pre Release Event

బాలకృష్ణకి రెండు భారీ హిట్లు ఇచ్చిన బోయపాటి మూడో సినిమాగా 'అఖండ' చేశాడు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ .. "ఇలాంటి పరిస్థితులలో సినిమాలను నిర్మిస్తున్న ప్రతి నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పాలి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు .. విడుదల ఆలస్యమయ్యాయి. వడ్డీలు పడుతున్నప్పటికీ 21 నెలల పాటు నిర్మాతలు ఉగ్గబట్టారు. అలాంటి నా నిర్మాతల కోసం అంతా క్లాప్స్ కొట్టాల్సిందే.బాలకృష్ణ గారి చేతికి గాయం కావడానికి కూడా చాలావరకూ నేనే కారణం. ఇందాక 'జై బాలయ్య' పాటకు బాలకృష్ణగారు ఎంత ఎనర్జీతో డాన్స్ చేశారో చూశారు. ఆ పాటకి డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్లిన ఆయన ఆ తరువాత కాలు జారి ఒక షోల్డర్ మీద ల్యాండ్ అయ్యారు. అవతల కోటిన్నర పెట్టి వేసిన సెట్ .. డాన్సర్స్ అంతా రెడీ. ముందురోజు నైట్ ఇది జరిగింది. విషయం తెలియగానే నా గుండె జారిపోయింది. కానీ ఆ నొప్పితోనే ఆయన మరుసటి రోజు షూటింగుకి వచ్చారు. ఆయన  చేయి పైకి లేవడం లేదు. అయినా మాస్ ఆడియన్స్ కోసం చేస్తానని అన్నారు.

మాస్ ఆడియన్స్  ఉన్నదే నా కోసం .. వాళ్ల కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎట్లా .. నేను చేస్తాను అన్నారు. భుజం నొప్పిని భరిస్తూ ఆయన ఆ పాటకి డాన్స్ చేశారు .. అదీ బాలయ్య అంటే. అభిమానుల పట్ల ఆయనకి గల ప్రేమ అలాంటిది. నిజంగా ఈ రోజున నేను ఈ స్టేజ్ ను షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను ఎందుకంటే నేను డైరెక్టర్ గా ఎదగాలని అనుకుంటున్నప్పుడు నాకు హెల్ప్ చేసిన వ్యక్తి బన్నీ బాబు. ఆ తరువాత నేను కెరియర్ ను స్టార్ట్ చేసి ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం బాలయ్యబాబు.

వాళ్లిద్దరూ ఒక స్టేజ్ పై ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. నిజానికి పైకి మామూలుగా ఉన్నాను గాని లోపల చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 2వ తేదీన 'అఖండ' విడుదలవుతుంటే 17వ తేదీన 'పుష్ప' రిలీజ్ అవుతోంది. ఈ రోజున ఇంత ఎంకరేంజ్ మెంట్ ఇచ్చి ఈ సినిమాను ముందుకు నడిపిస్తున్న బన్నీకి ఆ రోజున కూడా మనమంతా  కలిసి 'పుష్ప' సినిమాను ముందుకు నడిపించాలి. అందరూ కలిసి 'ఆర్ ఆర్ ఆర్' ముందుకు నడిపించాలి. అలాగే 'భీమ్లా నాయక్'ను కూడా ముందుకు నడిపించాలి" అని చెప్పుకొచ్చారు.