Begin typing your search above and press return to search.

#NBK 106 టైటిల్ ఇదేనంటూ..!?

By:  Tupaki Desk   |   15 Dec 2019 6:49 AM GMT
#NBK 106 టైటిల్ ఇదేనంటూ..!?
X
న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్ కెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. సింహ‌.. లెజెండ్ త‌ర్వాత మూడోసారి ఈ కాంబినేష‌న్ రిపీట‌వుతోంది. వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న బోయ‌పాటి ముందుఈసారి బిగ్ ఛాలెంజ్ ఉంది. అందుకే ఈసారి బాల‌య్య‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చి తాను స‌రైన ట్రాక్ లోకి రావాల‌ని క‌సితో ప‌నిచేస్తున్నాడట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కు వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని పూర్తి చేసి షూటింగ్ కి సిద్ధ‌మవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదీ అంటూ ప్ర‌చారం సాగుతోంది.

బాల‌య్య ఇమేజ్ .. స్క్రిప్ట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఐకాన్ అనే టైటిల్ ని బోయ‌పాటి అనుకున్నారట‌. అయితే ఈ టైటిల్ ఇప్ప‌టికే నిర్మాత దిల్ రాజ్ ఫిలిం ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించారు. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాకి టైటిల్ పోస్ట‌ర్ ని ఇంత‌కుముందు రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు బాల‌య్య -బోయ‌పాటి క‌థ‌కు అదే టైటిల్ ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో దిల్ రాజు ని ఒప్పించి టైటిల్ త‌మ వ‌శం చేసుకునే ఆలోచ‌న‌లో బోయ‌పాటి ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

దిల్ రాజు ఇంకా ఆ ప్రాజెక్ట్ ను మొద‌లు పెట్ట‌లేదు కాబ‌ట్టి బాల‌య్య పై గౌర‌వంతో ఆ టైటిల్ ను త్యాగం చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. లెజెండ్‌- సింహా- జైసింహా లాంటి టైటిల్స్ లో ప‌వ‌ర్ .. మాసిజం క‌నిపిస్తోంది. కానీ ఐకాన్ టైటిల్ లో ఆ రెండు మిస్స‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అయితే ఈ టైటిల్ తో బాల‌య్య‌ను క్లాసీ గా చూపించే ఉద్ధేశం ఏదైనా ఉందా? అస‌లు ఈ టైటిల్ బాల‌య్య కు ప‌ర్ పెక్ట్ గా సూట‌వుతుందా? అన్న సందేహాలు మ‌రోవైపు ఫ్యాన్స్ లో వ్య‌క్తం అవుతున్నాయి.