Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం హాలీవుడ్‌ టైటిల్‌!

By:  Tupaki Desk   |   5 July 2020 9:36 AM GMT
బాలయ్య కోసం హాలీవుడ్‌ టైటిల్‌!
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా టైటిల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మోనార్క్‌ అనే టైటిల్‌ ను ఈ చిత్రం కోసం కన్ఫర్మ్‌ చేశారనే టాక్‌ వినిపించింది. సింహా.. లెజెండ్‌ ల స్థాయిలో మోనార్క్‌ టైటిల్‌ ఉందనే ఉద్దేశ్యంతో బోయపాటి ఇంకా బాలయ్యలు ఆ టైటిల్‌ కే మొగ్గు చూపించారని ప్రచారం జరిగింది. కాని తాజాగా ఈ చిత్రం కు సంబంధించి మరో కొత్త టైటిల్‌ ప్రచారం జరుగుతోంది.

బాలయ్య చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాకు సూపర్‌ మాన్‌ అనే టైటిల్‌ ను అనుకుంటున్నారట. ఈ టైటిల్‌ తో హాలీవుడ్‌ లో సినిమా వచ్చింది. అది బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. సూపర్‌ మాన్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం ఉన్న టైటిల్‌. అందుకే ఈ టైటిల్‌ తో సినిమా అయితే ఖచ్చితంగా మంచి స్పందన వస్తుందనే నమ్మకంను నందమూరి అభిమానులు చెబుతున్నారు.

ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ఒక వీడియో నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారి వైరస్‌ కాస్త తగ్గిన తర్వాత షూటింగ్‌ కు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాదిలో విడుదల చేయాలని అనుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.