మరో సరైనోడు వస్తుందా ?

Wed Jul 17 2019 23:00:01 GMT+0530 (IST)

Boyapati New Movie In Geetha Arts Banner

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాగా సరైనోడు అంటే బన్నీ ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. అందుకే దర్శకుడు బోయపాటి శీనుతో మరోసారి ఎప్పుడు కాంబో రిపీట్ అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గీత ఆర్ట్స్ సంస్థలో ఇది వన్ అఫ్ ది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం పట్ల అల్లు అరవింద్ చాలా సార్లు దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. దీని దెబ్బకే శీను మార్కెట్ కూడా బాగా పెరిగింది.అయితే ఈ ఏడాది సంక్రాంతి  వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ రిజల్ట్ శీనుని బాగా ఇబ్బంది పెట్టేసింది. చేతి దాకా వచ్చిన బాలయ్య సినిమా వాయిదా పడడానికి కారణం ఇదేనన్నది ఓపెన్ సీక్రెట్ . అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న బోయపాటి నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనే విషయం ఆరు నెలల నుంచి సస్పెన్స్ గానే ఉంది. దీనికి ఇవాళ అల్లు అరవింద్ స్వయంగా చెక్ పెట్టేశారు.

కార్తికేయ హీరోగా రూపొందిన గుణ 369 ట్రైలర్ లాంచ్ కి అతిధిగా వచ్చిన ఆయన మరో గెస్ట్ బోయపాటి శీను గురించి చెబుతూ త్వరలోనే గీతా ఆర్ట్స్ లో తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించేశారు. ఊరికే నోటిమాటగా అల్లు అరవింద్ పబ్లిక్ స్టేజి మీద ఇలాంటి హామీలు ఇవ్వరు. మరి ఇలా చెప్పేశారు అంటే బ్యాక్ గ్రౌండ్ లో పని జరుగుతున్నట్టేగా. కాకపోతే హీరో అల్లు అర్జున్ అయ్యే ఛాన్స్ లేదు. ఇదే వేదిక మీద ఉన్న కార్తికేయను ఉద్దేశించి వెల్కమ్ టు గీత ఆర్ట్స్ అన్నారంటే ఇదే హీరోతోనే బోయపాటి శీను సినిమా ఉంటుందని గతంలో వచ్చిన వార్త నిజమవుతుందేమో