Begin typing your search above and press return to search.

అడ్వాన్సులు తీసుకోడానికి ఆలోచిస్తున్న స్టార్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   7 July 2020 8:50 AM GMT
అడ్వాన్సులు తీసుకోడానికి ఆలోచిస్తున్న స్టార్ డైరెక్టర్...?
X
టాలీవుడ్ లో మాస్ చిత్రాల డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. స్టార్ హీరోలైన బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లాంటి వారితో ఊర మాస్ యాక్షన్ చిత్రాలను రూపొందించాడు. 'భద్ర' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బోయపాటి శీను త‌న 15 ఏళ్ల కెరీర్‌ లో కేవలం 8 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసాడు. స్లో అండ్ స్టడీగా సినిమాలను రూపొందిస్తూ మాస్ ఆడియన్స్ లో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. 'తులసి' సింహా' 'లెజెండ్' 'సరైనోడు' 'జయజానకి నాయక' వంటి విజయవంతమైన చిత్రాలు అందించాడు. అయితే 2016లో వచ్చిన 'సరైనోడు' సినిమా తర్వాత బోయపాటి సరైన హిట్ అందుకోలేకపోయారని చెప్పవచ్చు.

ఇక గతేడాది రామ్ చరణ్ తో రూపొందించిన 'వినయ విధేయ రామ' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ ఒక్క సినిమాతో బోయపాటి శ్రీను క్రేజ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పడిపోయిందని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మరోసారి హిట్ కాంబినేషన్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం నందమూరి బాలకృషతో ఓ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు శ్రీను. వీరి కాంబోలో ఇప్పటికే విడుదలైన 'సింహా' 'లెజెండ్' సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. బోయపాటి ఈజ్ బ్యాక్ అనుకునే రేంజ్ లో ఉంది ఈ టీజర్. దీంతో ఒక్కసారిగా నిర్మాతలు కళ్ళు మళ్ళీ బోయపాటి శ్రీను మీద పడ్డాయి.

ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ బోయపాటికి అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారట. అయితే ఈ మాస్ డైరెక్టర్ మాత్రం బాలయ్యతో సినిమా కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం.. ప్రస్తుతానికి వెళ్ళండి అని తేల్చి చెబుతున్నాడట. బాలయ్య సినిమా తర్వాత తన రేంజ్ పెరిగిపోతుంది.. అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అడ్వాన్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాకుండా గతంలో బాలయ్య సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకోవడం వల్లనే తన ఫేట్ మారిందని.. ఇప్పుడు మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నాడని సన్నిహిత వర్గాలలో చర్చించుకుంటున్నారు. మరి బాలయ్య సినిమా బోయపాటికి ఎంత డిమాండ్ తీసుకురాబోతుందో చూడాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.