పుకార్లు కొట్టి పారేసిన బోయపాటి

Tue Jul 07 2020 16:15:45 GMT+0530 (IST)

Boyapati Gives Clarity On Bala Krishna Movie

బాలకృష్ణతో గతంలో సింహా లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ను తెరకెక్కించిన బోయపాటి ప్రస్తుతం మూడవ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకం గా ఉన్నారు. సినిమా ను ఈ ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేయాలనుకుంటే మహమ్మారి వైరస్ కారణంగా సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ విషయం లో దర్శకుడు బోయపాటి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆమద్య ఒక కొత్త అమ్మాయిని తీసుకు రాబోతున్నట్లుగా చెప్పాడు. కాని గత రెండు మూడు రోజులు గా బాలయ్య కు జోడీ గా అమలా పాల్ ఎంపిక అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. అమలా పాల్ త్వర లోనే బాలయ్య తో టెస్ట్ షూట్ లో పాల్గొనబోతుందనే వార్తలు వచ్చాయి.మీడియాలో వస్తున్న బాలయ్య హీరోయిన్ వార్తల పై బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. అమలా పాల్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లు గా వస్తున్న వార్తలు నిజం కాదన్నాడు. ఈ సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్ ను అనుకున్నప్పటికి చివరకు కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ కొత్త హీరోయిన్ సినిమాలకు కొత్తనా లేదంటే కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కొత్తనా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించే అవకాశం లేదంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.