Begin typing your search above and press return to search.

BB3 హీరోయిన్‌ మరో అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   11 July 2020 11:30 AM GMT
BB3 హీరోయిన్‌ మరో అప్‌ డేట్‌
X
గత కొన్నాళ్లుగా బాలకృష్ణ ఎవరితో సినిమా చేసినా కూడా హీరోయిన్స్‌ విషయంలో చాలా పెద్ద జరుగుతూనే ఉంది. హీరోయిన్స్‌ కొందరు బాలయ్యతో నటించేందుకు ఒప్పుకోవడం లేదని దాంతో మళ్లీ మళ్లీ వారినే రిపీట్‌ చేస్తూ బాలయ్య నెట్టుకు వస్తున్నాడు అనే పుకార్లు ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంకు సంబంధించి కూడా సినిమా ప్రారంభించినప్పటి నుండి హీరోయిన్‌ విషయమై మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవలే కొత్త అమ్మాయిని తమ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నట్లుగా బోయపాటి ప్రకటించాడు. ఇటీవలే బాలయ్యకు జోడీగా హీరోయిన్‌ ను కన్ఫర్మ్‌ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ కు చెందిన ఒక నటితో బోయపాటి చర్చలు జరిపాడట. బాలీవుడ్‌ లో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదని.. అయితే మోడల్‌ గా మాత్రం ఆమె సుపరిచితురాలిగా టాక్‌ వినిపిస్తుంది. బాలయ్య కు ఆమె సరి జోడీగా భావిస్తున్నారట. బాలయ్య వయసు రీత్యా కూడా ఆమె తప్పకుండా సెట్‌ అవుతుందనే నమ్మకంతో బోయపాటి ఉన్నాడు.

సింహా.. లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. కనుక ఈ చిత్రంపై అందరికి అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. కనుక అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించే ఉద్దేశ్యంతో దర్శకుడు బోయపాటి ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెట్టుబడి పెట్టిస్తున్నాడు. హీరోయిన్‌ విషయంలో కూడా చాలా చర్చలు జరిపి చివరకు ఆమెను ఎంపిక చేశారట. త్వరలోనే హీరోయిన్‌ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.