Begin typing your search above and press return to search.

'గ‌ని' మార్చికి వాయిదా నిజ‌మా?

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:30 PM GMT
గ‌ని మార్చికి వాయిదా నిజ‌మా?
X
ఒకే డేట్ కి రెండు క్రేజీ సినిమాలు రిలీజైతే దానివ‌ల్ల క‌లెక్ష‌న్స్ షేర్ చేసుకోవాల్సి వ‌స్తుంది. దానివ‌ల్ల ఓపెనింగుల‌కు న‌ష్టం త‌ప్ప‌దు. ఆ త‌ర్వాత టాక్ ని బ‌ట్టి క‌లెక్ష‌న్స్ అమాంతం డ్రాప్ అయిపోతాయి. ఆ ప్ర‌మాదం నివారించాలంటే మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! అన‌కుండా మాట్లాడి రిలీజ్ తేదీల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఇప్పుడు అదే చేసార‌ట ఆ ఇద్ద‌రూ..

ఈనెల‌(డిసెంబ‌ర్) 24న శ్యామ్ సింగరాయ్ వ‌ర్సెస్ గ‌ని ఎపిసోడ్ కి ఆస్కారం ఉండ‌గా.. నాని- వరుణ్ తేజ్ మాట్లాడుకున్నార‌ట‌. తాజా స‌మాచారం మేర‌కు వ‌రుణ్ వెన‌క్కి త‌గ్గారు. నాని అన్న‌య్య‌కు చోటిచ్చారు. స్పోర్ట్స్ డ్రామా గ‌ని వాయిదా పడింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. గని మార్చికి వాయిదా పడే అవకాశం ఉందని ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

శ్యామ్ సింగ‌రాయ్ -గ‌ని నిర్మాతలు థియేటర్లలో ఘర్షణను నివారించడానికి ఏకాభిప్రాయానికి వచ్చారట‌. దీంతో సినిమా సోలోగా విడుదల కానుండడంతో నానికి లైన్ క్లియర్ అయిందన్న టాక్ వైర‌ల్ అవుతోంది.

అయితే జ‌న‌వ‌రి- ఫిబ్ర‌వ‌రి సీజ‌న్ లో వ‌రుస‌గా భారీ చిత్రాల జాత‌ర ఉంది. ఇందులో మెగా సినిమాలు ఉన్నాయి. అందుకే మార్చి వ‌ర‌కూ వెళ్లేందుకు గ‌ని ఆలోచ‌న చేశార‌ట‌. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అల్లు బాబీ `గ‌ని`తో సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాడు.

ఈ సినిమాను ఆయ‌న ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నారు. అందుకే ఎందులోనూ రాజీ ప‌డ‌డం లేదట‌. ఓపెనింగులకు గండి ప‌డ‌కుండా గ‌ని కోసం చాలా వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది. నాని - శ్యామ్ సింగరాయ్ మాత్రమే క్రిస్మస్ కి విడుదల అవుతుంది. అటుపై జ‌న‌వ‌రి వ‌చ్చేస్తుంది.

రాజమౌళి - RRR సంక్రాంతికి ముందు జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధేశ్యామ్ - భీమ్లా నాయ‌క్ కూడా సంక్రాంతి ముందే విడుద‌ల‌వుతున్నాయి. ఇక‌పోతే పుష్ప చిత్రం ఈనెల 17న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే.