బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో జాతరేనా?

Wed Jan 25 2023 07:00:02 GMT+0530 (India Standard Time)

Box office war in theaters

సంక్రాంతి సీజన్ తో బిగ్ వార్ పూర్తయింది. త్వరలో సమ్మర్ వార్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే భారీ స్థాయిలో క్రేజీ సినిమాల జాతర వుండనుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని క్రేజీ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుని బాక్సాఫీస్ వార్ ని డిక్లేర్ చేసేశారు. మరి కొంత మంది క్రేజీ స్టార్ లు ఈ వార్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఏ స్టార్ హీరో ఏ సినిమాతో పోటీకి దిగనున్నాడో.. ఏ రేంజ్ సినిమాలతో బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారో ఒకసారి చూద్దాం. ఇందులో ఎక్కువగా గ్యాంగ్ స్టర్ మూవీసే ఎక్కువగా వుండటం గమనార్హం.ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ `స్పిరిట్`. ప్రభాస్ హీరోగా `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటం వల్ల ఆలస్యం అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ మూవీ ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్ వార్ ఫిల్మ్ అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే సందీప్ రెడ్డి ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో రూపొందిస్తున్న`యానిమల్` కూడా గ్యాంగ్ వార్ మూవీనే అని తెలుస్తోంది.

తండ్రి కోసం గ్యాంగ్ స్టర్ గా మారిన ఓ యువకుడి కథగా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో అనిల్ కపూర్ బాబీ డియోల్ నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ఆగస్టు 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సుజీత్ చేయబోతున్న మూవీ కూడా గ్యాంగ్ స్టర్ కథే అని ఫస్ట్ లుక్ పోస్టర్ తో తేలిపోయింది.

`దే కాల్ హిమ్ ఓజీ` అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ కూడా గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ ఇచ్చేశారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ముంబై జపాన్ నేపథ్యంలో సాగనుంది. వీటితో పాటు ఎర్రచందనం నేపథ్యంలో సాగే `పుష్ప 2` కూడా గ్యాంగ్ స్టర్ మూవీనే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. డా. రాజశేఖర్ కూడా గ్యాంగ్ స్టర్ మూవీతో రాబోతున్నాడు. పవన్ సాధినేనితో రాజశేఖర్ చేస్తున్న `మాన్‌స్టర్` కూడా గ్యాంగ్ స్టర్ మూవీనే.  

ఇదే బ్యాచ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న యాక్షన్ డ్రామా `మైఖేల్`. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక `విక్రమ్`తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విజయ్ 67ని త్వరలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇది గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే మూవీ అని చెబుతున్నారు. ఫహద్ ఫాజిల్ తో పాటు సంజయ్ దత్ ఇందులోని కీలక పాత్రల్లో నటించనున్నారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కూడా ఈ ఏడాదే థియేటర్లలోకి రానుందట. ఇక కార్తి `ఖైదీ 2` ఉపేంద్ర కిచ్చా సుదీప్ కలిసి నటించిన `కబ్జ`. ఇది కూడా గ్యాంగ్ స్టర్ మూవీనే. ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ మూవీ `కింగ్ ఆఫ్ కోత` కూడా గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఈ మూవీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా ఇదే తరహా కథలతో ఈ ఏడాది బాక్సాఫీస్ వార్ తో థియేటర్లలో జాతర వాతావరణాన్ని సృష్టించబోతుండగం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.