Begin typing your search above and press return to search.

ఈ నెలంతా 'డబ్బు' చుట్టూనే తిరుగుతోంది..!

By:  Tupaki Desk   |   14 May 2022 4:10 AM GMT
ఈ నెలంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది..!
X
టాలీవుడ్ లో మే నెల అంతా డబ్బు చుట్టూనే తిరగబోతోంది. మనీ నేపథ్యంలో రూపొందిన రెండు పెద్ద సినిమాలు ఈ సమ్మర్ సీజన్ లో బాక్సాఫీస్ లెక్కలు సరిచేయబోతున్నాయి. ఇప్పటికే ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా.. మరొకటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 3' మే 27న థియేటర్లలో నువ్వులు పంచడానికి సిద్ధమైంది.

అయితే ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలు కూడా 'డబ్బు' అనే ఎలిమెంట్ చుట్టూనే తిరుగుతాయి. 'సర్కారు వారి పాట' సినిమా ప్రస్తుతం ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ.. బ్యాంకు రుణాలకు సంబంధించినది. ఇందులో హీరో అమెరికాలో వడ్డీకి హ్యాండ్ లోన్స్ ఇస్తూ.. వారి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటుంది.

సంపన్నులు బ్యాంకులను ఎలా దోచుకుంటున్నారు? అది పేద మరియు మధ్యతరగతి ప్రజలపై భారాన్ని పెంచడానికి దారితీసే పరిస్థితులను.. సామాన్యులు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడానికి ఎలా కష్టపడుతున్నారనేది సందేశాత్మకంగా SVP సినిమాలో చూపించారు.

'ఎఫ్ 3' సినిమా విషయానికొస్తే.. 'ఎఫ్ 2' ప్రాంఛైజీలోని ఫన్ - ఫస్ర్టేషన్ కు ఈసారి ఫైనాన్స్ (డబ్బు) అంశాన్ని జత చేసి మూడింతల వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బున్న వాడికి ఫన్.. లేని వాడికి ఫస్ర్టేషన్ అని ట్రైలర్ లో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు విడుదలైన 'ఎఫ్ 3' ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి.. ఇది మధ్యతరగతి కుటుంబాల కలల ప్రామాణికంగా సినిమా అంతా మనీ చుట్టూనే తిరుగుతుందని క్లారిటీ వచ్చేసింది.

అయితే రెండు సినిమాల్లో ఉన్న తేడా ఏమిటంటే, 'సర్కారు వారి పాట' సీరియస్ నోట్‌ లో నడుస్తుండగా.. 'F3' మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. రెండూ డబ్బు నేపథ్యంలో ఉండటం.. అదీ ఒకే నెలలో వస్తుండటంతో అందరి దృష్టి పడింది.

పరశురాం పెట్లా దర్శకత్వంలో మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రికవరీ చేయడం మొదలు పెట్టింది.

మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థకు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. డబ్బు నేపథ్యంలో వచ్చిన SVP పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకొస్తుందా లేదా అనేది ఈ వీకెండ్ తో తేలిపోతుంది.

ఇక 'ఎఫ్ 3' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా - మెహరీన్ హీరోయిన్లుగా నటించగా సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించనుంది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.