Begin typing your search above and press return to search.

కంగ‌న‌కు స‌మాధానం ఇవ్వాల‌ని రౌత్ కి హైకోర్ట్ ఆదేశం

By:  Tupaki Desk   |   25 Sep 2020 12:00 PM GMT
కంగ‌న‌కు స‌మాధానం ఇవ్వాల‌ని రౌత్ కి హైకోర్ట్ ఆదేశం
X
ముంబైలోని తన బంగ్లాలో కొంత భాగాన్ని బిఎమ్‌సి కూల్చివేసినందుకు వ్యతిరేకంగా కంగన రనౌత్ పిటిషన్ ‌కు సమాధానం (దాఖలు) ఇవ్వా‌ల‌ని బాంబే హైకోర్టు గురువారం శివసేన ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్ ‌ను ఆదేశించింది.

న్యాయమూర్తులు ఎస్ జె కథవల్లా - ఆర్ ఐ చాగ్లా ధర్మాసనం బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) హెచ్-వార్డ్ ఆఫీసర్ భాగ్యవంత్ లేట్ ఈ పిటిషన్ కు తన సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 7 న రనౌత్ కి అందించిన కూల్చివేత నోటీసుపై భాగ్య‌వంత్ సంతకం చేశారు.

మంగళవారం నాడు రనౌత్ న్యాయవాది అయిన సీనియర్ న్యాయవాది బిరేంద్ర సరాఫ్ కోర్టులో ఒక ప్రసంగానికి సంబంధించిన ఒక DVD ని కోర్టులో సమర్పించారు. దీనిలో రౌత్ కంగ‌న‌నుని బెదిరిస్తూ వ్యాఖ్యానించాడు. దీని తరువాత రౌత్ .. భ‌గ‌వంత్ పార్టీలను ఈ కేసులో చేర్చ‌డానికి హైకోర్టు బెంచ్ రనౌత్ కు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తుది విచారణను శుక్రవారం ప్రారంభిస్తామని గురువారం ధర్మాసనం తెలిపింది.

శివసేన రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం న్యూదిల్లీలో ఉన్నారని రౌత్ న్యాయవాది ప్రదీప్ తోరత్ తెలిపారు. కోర్టుకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం కోరారు. BMC సీనియర్ న్యాయవాది అనిల్ సఖ్రే లేట్ తన సమాధానం దాఖలు చేయడానికి ఎక్కువ సమయం కోరారు.

``మేము కూల్చి వేసిన ఇంటిని అదే విధంగా వదిలి వేయలేం. భవనం పాక్షికంగా కూల్చివేశారు. రుతుపవనాల సీజ‌న్ లో మేము దానిని ఈ స్థితిలో ఉంచలేము. మేము రేపు పిటిషనర్ విచారణ ప్రారంభిస్తాం`` అని ధర్మాసనం తెలిపింది. తన పాలి హిల్ బంగ్లా వద్ద బిఎంసి చేపట్టిన కూల్చివేత చట్టవిరుద్ధమని ప్రకటించాలని రనౌత్ సెప్టెంబర్ 9 న హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పౌరసంఘం బీఎంసీ అధికారుల నుండి రెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరాలని ఆమె తన విజ్ఞప్తిని సవరించారు.

శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా కంగ‌న‌ కొన్ని వ్యాఖ్యలు చేసినందున బిఎంసి బంగ్లాను కూల్చివేసిందని తన విజ్ఞప్తిలో ఆరోపించారు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ లో బీఎంసీ ఈ ఆరోపణ ను ఖండించింది. అయితే రనౌత్ అభ్యర్ధన ను కొట్టివేయాలని ఆమెపై ఖర్చు విధించాలని పౌరసంఘం హైకోర్టును కోరింది.