'బిట్ కాయిన్' అయోమయంలో బాలీవుడ్ స్టార్స్..!

Thu Jun 24 2021 08:00:02 GMT+0530 (IST)

Bollywood stars confused by bitcoin

ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న అంశం బిట్ కాయిన్. కొద్దిరోజులుగా ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్ గందరగోళంగా మారింది. తాజాగా ఈ బిట్ కాయిన్ వేల్యూ 30 వేల డాలర్స్ కిందకి పడిపోయింది. గడిచిన ఏప్రిల్ నెలలో అత్యధికంగా 64 వేల డాలర్స్ వరకు పెరిగిన బిట్ కాయిన్ విలువ తాజాగా ఒక్కసారిగా కూలిపోయే సరికి ఇన్వెస్ట్ చేసిన వారంతా అయోమయంలో పడిపోయారు. ఇటీవలే క్రిప్టోమైనింగ్ కోసం విద్యుత్ వాడకం ఎక్కువ అవుతోందని టెస్లా అధినేత ఏలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేసాడు.ఇప్పుడు ఆయన చెప్పిన విధంగానే బిట్ కాయిన్ పై పరిస్థితి రివర్స్ అయింది. అదిగాక ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ పై చైనా ప్రభుత్వం కూడా రివర్స్ అవ్వడంతో బిట్ కాయిన్ వేల్యూ రోజురోజుకి పడిపోతూ వచ్చింది. కొంతకాలంగా ఇప్పటివరకు ఇన్వెస్టర్ల పొందిన లాభాలన్నీ ఒక్కసారిగా తుడిచి పెట్టుకుపోయాయని తెలుస్తుంది. మరి ఇంత భారీ లాస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ కూడా ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ బిట్ కాయిన్ బిజినెస్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందులోను ఎక్కువ బాలీవుడ్ స్టార్స్ ఉన్నారని కథనాలు చెబుతున్నాయి.

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన పలువురు ఈ బిట్ కాయిన్ బిజినెస్ లో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారని బాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్స్.. హీరోలు కూడా భారీ మొత్తంగా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్టర్స్ గా ఉన్నారని తెలుస్తుంది. మొన్నటివరకు లాభాలతో మురిసిపోయిన వారందరికీ బిట్ కాయిన్ సడన్ గా కోలుకోలేని షాకిచ్చింది. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు. ఇండియాలోని బడాబడా బిజినెస్ మాగ్నెట్స్ అందరూ ఈ బిట్ కాయిన్ లో భాగస్వామ్యం అయ్యారని సమాచారం. మరి ఈ లెక్కన ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టినవారంతా నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. మరి బాలీవుడ్ హీరోలు ప్రొడ్యూసర్స్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేసారనేది తెలియాల్సి ఉంది.