చైతన్య నవ్వు వెనుక అర్థాలు వెతుకుతున్న బాలీవుడ్ మీడియా..!

Thu Aug 11 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Bollywood media On Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య - సమంత జంట పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ ఎవరి దారిలో వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత చైతూ మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.'మేజర్' బ్యూటీ శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్ షిప్ లో ఉన్నారని.. ఇద్దరూ తరచుగా కలుస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు శోభిత స్పందించలేదు. చైతూ మాత్రం ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ పై పలు ఇంటర్వ్యూలలో స్పందించారు కానీ.. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు.

చైతన్య గత కొన్ని రోజులుగా తన తొలి హిందీ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ యూట్యూబ్ ఛానెల్స్ - ఆన్ లైన్ పోర్టల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల రిలేషన్షిప్ స్టేటస్ గురించి చై అడిగినప్పుడు.. కేవలం నవ్వి ఆ టాపిక్ ని దాటవేసాడు.

'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?' అని అడగ్గా.. నాగ చైతన్య నవ్వేశారు. నేను జస్ట్ నవ్వుతానని బదులిచ్చారు. ఇది చాలా సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలో అక్కినేని హీరో పరోక్షంగా తన డేటింగ్ ను కన్ఫర్మ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇప్పుడు లేటెస్టుగా మరొక ఇంటర్వ్యూలో చైతూ దీని గురించే ప్రశ్న ఎదుర్కొన్నాడు. ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? అని యాంకర్ అడగ్గా.. నాగచైతన్య అదే నవ్వును పునరావృతం చేసాడు. ఆ నవ్వుకి అర్థం ఏమిటి? హ్యాపీగా ఉన్నారా? అని అడగ్గా.. 'హా.. హ్యాపీ స్టేటస్' అని యువసామ్రాట్ బదులిచ్చారు.

నాగచైతన్య ఇలా రిలేషన్షిప్ స్టేటస్ పై ప్రశ్నించిన ప్రతిసారి నవ్వి వదిలేస్తున్నాడు. దీంతో పరోక్షంగా కొంటె చిరునవ్వుతో అవసరమైన హింట్స్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటి వాటి మీద స్పందించనని సింపుల్ గా నవ్వుతో చెప్పేసాడని అంటున్నారు.

నిజానికి సమంత తో విడిపోయిన తర్వాత చైతన్య మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వచ్చారు. కానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోక తప్పలేదు. అయితే మీడియా వర్క్ గురించి మాట్లాడటం కంటే.. తన వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని.. అది కాస్త ఇబ్బందిగా ఉందని చైతూ చెప్పిన సంగతి తెలిసిందే.