ఇండస్ట్రీలో బయటపడ్డ మరో సెక్స్ రాకెట్...!

Fri Jan 17 2020 10:35:59 GMT+0530 (IST)

Bollywood casting director arrested over sex racket

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ..సెక్స్ రాకెట్. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ - వారి శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇలాంటివారిని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా కూడా ఈ సెక్స్ రాకెట్  నడిపేవారు కూడా కొత్త కొత్త ఐడియాలతో ముందుకువస్తున్నారు. తాజాగా మరో సెక్స్ రాకెట్ బయటపడింది. ముంబై పోలీసులు ఈ సెక్స్ రాకెట్ ని గుట్టు రట్టు చేశారు.ముంబై మహా నగరంలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న సినీ డైరెక్టర్ దందా వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్‌లతో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ను ముంబై పోలీసులు సినీ ఫక్కీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతగాడి సెక్స్ రాకెట్ దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ కుమార్ ప్రేమ్ లాల్ ఆర్య  అనే వ్యక్తి బాలీవుడ్ లోని పలు సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. సినిమాల్లో నటించాలనే ఆశతో ముంబైకి వచ్చే యువతులనే వీరు టార్గెట్ గా చేసుకుని పరిచయం చేసుకుంటారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ యువతులకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. చివరకు సినీ అవకాశాలు ఇప్పించకుండా వంచనకు దిగుతున్నారు. ఇలా అనేక మందిని వీరు దారుణంగా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

విటులు మాదిరిగా పోలీసులు నవీన్ కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలంటూ అడిగారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరిని పంపుతున్నట్లు వారికి తెలిపాడు. వారిలో ఒక్కో మహిళకు రూ.60 వేల చొప్పున ఇవ్వడంతో పాటు - హోటల్ ఖర్చులను కూడా భరించాలని తెలిపాడు. అతగాడు చెప్పిన అన్ని షరతులకూ ఒప్పుకున్నారు. చివరకు యువతులతో కలిసి హోటల్ కు వచ్చిన నవీన్ కుమార్ ను పోలీసులు రెడ్ హ్యాండెట్ గా పట్టుకున్నారు. ఇద్దరు యువతుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో బాలీవుడ్ లోని అనేక చీకటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.