Begin typing your search above and press return to search.

దక్షిణాదికి క్యూ కడుతున్న బాలీవుడ్ బడా స్టార్లు!

By:  Tupaki Desk   |   14 Jan 2021 2:30 AM GMT
దక్షిణాదికి క్యూ కడుతున్న బాలీవుడ్ బడా స్టార్లు!
X
ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలన్నీ బాలీవుడ్లో నిర్మాణం జరుపుకునేవి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలకు దక్షిణాది కేరాఫ్ అడ్రస్ గా మారింది.ముఖ్యంగా తెలుగులో పాన్ ఇండియా కేటగిరి సినిమాలు ఎక్కువగా రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే కన్నడ నాట తీసిన కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్ తో కేజీఎఫ్- 2 సీక్వెల్ విడుదలకు సిద్ధం కాబోతోంది. తమిళంలో కూడా ఇటీవల పొన్నియన్ సెల్వం వంటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

దీంతో బాలీవుడ్ అగ్ర నటులు కూడా ప్రాంతీయ భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరాలో కూడా అమితాబచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ -2లో ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ అధీర అనే బలమైన పాత్రల్లోకనిపించనున్నారు. సంజయ్ దత్ రాకతో కేజీఎఫ్- 2 పై అంచనాలు మరింత పెరిగాయి. తమిళంలో రజనీకాంత్ తో కలిసి దర్బార్ సినిమాలో నటించిన సునీల్ శెట్టి మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే తమిళ్ లో నటించేందుకు కత్రినాకైఫ్ ఇటీవలే ఓ సినిమా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

ఇక తెలుగులో దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' లో బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా హిందీ నటి ఆలియాభట్ నటిస్తోంది. నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నపాన్ వరల్డ్ రేంజ్ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు దక్షిణాదిన భారీ బడ్జెట్ సినిమాలు రూపుదిద్దుకుంటుండటంతో బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.