Begin typing your search above and press return to search.

సౌత్ లో అడుగుపెట్టాలని ట్రై చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:30 AM GMT
సౌత్ లో అడుగుపెట్టాలని ట్రై చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..!
X
బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూతురిగా కెమెరా ముందుకొచ్చిన సోనమ్ కపూర్.. ‘సవారియా' అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది. తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. 'ఢిల్లీ 6' 'ఐ హేట్ లవ్ స్టోరీస్' 'భాగ్ మిల్కా భాగ్' 'ఐషా' 'రాంజానా' 'సంజు' 'నీర్జా' 'పాడ్ మ్యాన్' వంటి సినిమాలతో అలరించింది సోనమ్. కెరీర్ ఫుల్ ఫామ్‌ లో ఉండగానే యువ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ.

ఓవైపు వైవాహిక జీవితం కొనసాగిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ.. తనదైన వ్యవహారశైలితో వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు సోనమ్ కపూర్ హిందీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా తండ్రి అనిల్‌ కపూర్‌ - అనురాగ్‌ కశ్యప్‌ కాంబోలో రూపొందిన 'AK vs AK' సినిమాలో నటించింది. తాజాగా షోమ్‌ ముఖర్జీ దర్శకత్వంలో 'బైండ్‌' అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ లో అడుగుపెట్టడాని అమ్మడు తెగ ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త‌మిళ్ స్టార్ హీరో విజ‌య్ నటించే అప్ క‌మింగ్ మూవీలో సోన‌మ్ కపూర్ ని హీరోయిన్ గా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్ నడుస్తోంది.

విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. అందులో లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఒకవేళ సోనమ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తోంది విజయ్ - వంశీ కాంబోలో రూపొందే సినిమాలో అయితే.. ఈ బ్యూటీ తెలుగు వాళ్ల‌కి కూడా ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో #Thalapathy67 చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ ఏ సినిమాతో సౌత్ లోకి రాబోతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.