Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : క్యాట్ శారీ కట్టినా అందమే..!

By:  Tupaki Desk   |   28 Nov 2022 3:30 PM GMT
ఫోటో స్టోరీ : క్యాట్ శారీ కట్టినా అందమే..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లయింది కదా ఆమె పని అయిపోయింది అనుకున్నారేమో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దూకుడు ఏమాత్రం తగ్గించలేదు అమ్మడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కెరీర్ మరింత జోష్ లో ఉంది కత్రినా కైఫ్. ఓ పక్క మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మరోపక్క వరుస సినిమాలు కూడా చేస్తుంది క్యాట్. ఈమధ్యనే ఫోన్ బూత్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత తన గ్లామర్ షో తో అలరించింది.

ప్రస్తుతం మెర్రీ క్రిస్మస్, టైగర్ 3 మూవీస్ లో నటిస్తున్న కత్రినా కైఫ్ సినిమాలతో పాటుగా తన సోషల్ మీడియా ఫోటోస్ తో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా కత్రినా కైఫ్ శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శారీ లుక్ లో కూడా తన ఓర చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గిల్లేస్తుంది కత్రినా. బాలీవుడ్ లో ఎంతమంది భామలు ఉన్నా.. కొత్తగా ఎంతమంది భామలు వచ్చినా కత్రినా కైఫ్ కి స్పెషల్ క్రేజ్ సొంతమని చెప్పొచ్చు.

రీసెంట్ గా కత్రినా బేబీ బంప్ తో కనిపించిందని హడావిడి చేశారు. అలాంటి విశేషం ఏమైనా ఉంటే తానే స్వయంగా చెబుతా అని కామెంట్ చేసింది కత్రినా. ఫ్యామిలీ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే అమ్మడు తన సినిమాలు ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ ని కూడా అలరిస్తుంది.

కత్రినా లేటెస్ట్ శారీ ఫోటోలు మాత్రం లక్షల కొద్దీ లైక్స్ సాధిస్తుంది. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసిన కత్రినా ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. అయితే ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా టాలీవుడ్ బాట పడుతున్నారు కాబట్టి మళ్లీ కత్రినా తెలుగులో నటించే అవకాశాలు ఉన్నాయి.

దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెర మీద తన అందంతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన కత్రినా ఇదే దూకుడు చూపిస్తే మాత్రం మరో పదేళ్లు ఇదే ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.