Begin typing your search above and press return to search.

22 ఏళ్ల త‌ర్వాతే అత‌డితో స‌మానంగా పారితోషికం తీసుకున్నా: బాలీవుడ్ బ్యూటీ హాట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   5 Oct 2022 8:21 AM GMT
22 ఏళ్ల త‌ర్వాతే అత‌డితో స‌మానంగా పారితోషికం తీసుకున్నా:  బాలీవుడ్ బ్యూటీ హాట్ కామెంట్స్!
X
బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ప్రియాంకా చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో సెటిల్ అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కు దాదాపు దూర‌మైన ప్రియాంకా చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్‌లోనే మ‌కాం వేసి ప‌లు వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో న‌టిస్తోంది. త‌న కంటే 12 ఏళ్లు చిన్న‌వాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా ఓవైపు వైవాహిక జీవితాన్ని.. మ‌రోవైపు అమెరిక‌న్ లైఫ్ స్టైల్ ను ఆస్వాదిస్తోంది.

తాజాగా ప్రియాంకా చోప్రా డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఉమెన్స్ లీడర్‌ షిప్ ఫోరమ్‌ పేరుతో జరిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఈ కార్య‌క్ర‌మంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ఈ ముద్దుగుమ్మ ముచ్చ‌టించింది. అబార్షన్ హక్కులు, వేతన సమానత్వం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రియాంక‌, క‌మ‌లా హారిస్ ఇద్ద‌రూ త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ నేప‌థ్యంలో చిత్ర పరిశ్రమలో 22 ఏళ్ల‌లో మొదటిసారిగా ఈ ఏడాది మాత్ర‌మే తన సహనటుడితో సమానంగా పారితోషికం పొందాన‌ని ప్రియాంక వెల్ల‌డించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

కాగా పసుపు రంగు దుస్తులు, దానికి సరిపోయే హీల్స్‌లో చాలా అందంగా కనిపించిన ప్రియాంక‌.. మీరు (క‌మ‌లా హారిస్), నేను భార‌తీయ బిడ్డ‌ల‌మే అని పేర్కొంది. డెమోక్రాట్‌ మద్దతుదారులతో కిక్కిరిసిన హాలులో ఇంటర్వ్యూను ప్రారంభిస్తూ- "ఒక విధంగా మనిద్దరం భారతీయ కుమార్తెలం" అని ప్రియాంకా చోప్రా అన్నారు.

ప్రపంచానికి అమెరికా ఒక ఆశగా, శ్వాసగా, మెరుగైన ఎంపికగా ఉందని ప్రియాంకా చోప్రా పేర్కొన‌డం విశేషం. 20 ఏళ్లు సినిమాల్లో పనిచేసిన తర్వాత ఈ ఏడాది మాత్రమే పురుష నటులతో సమానంగా తనకు పారితోషికం అందినట్టు ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అమెరికా గాయకుడు నిక్‌ జోనస్‌ను వివాహమాడిన ప్రియాంక ఈ ఏడాది స‌రోగ‌సీ విధానంలో కుమార్తెకు జ‌న్మ‌నిచ్చింది.

ఈ కార్య‌క్ర‌మంలో అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్‌ మాట్లాడుతూ- "మనం ఇప్పుడు అస్థిరమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రపంచమంతటా పర్యటిస్తున్నా. వంద మంది ప్రపంచ స్థాయి నేతలతో నేరుగా, ఫోన్‌లో మాట్లాడాను. ఎక్కడికక్కడ ఘర్షణలు తలెత్తుతున్నాయి. ర‌ష్యా దాడితో ఉక్రెయిన్‌ ఇప్పుడు చితికిపోయింది" అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా వాతావరణ మార్పులు, సమానత్వం, అమెరికాలో సమాన ఓటు హక్కు మంజూరు వంటి అంశాలు ప్రియాంక చోప్రా, క‌మ‌లా హారిస్ మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.