Begin typing your search above and press return to search.

బెల్లంకొండతో రొమాన్స్ చేసే బాలీవుడ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   17 May 2022 12:30 PM GMT
బెల్లంకొండతో రొమాన్స్ చేసే బాలీవుడ్ బ్యూటీ..!
X
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంటాయి. తెలుగులో ప్లాప్ అయిన చిత్రాలు సైతం నార్త్ లో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఈ నేపథ్యంలో అల్లుడు శ్రీను ఇప్పుడు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ ను టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. ఇప్పుడు అతన్ని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. అయితే షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది. మంగళవారం నుష్రత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

నిజానికి #BSS9 సినిమాలో బెల్లంకొండకు జోడీగా పాపులర్ హీరోయిన్ ని తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయితే పలువురు అగ్ర కథానాయికలు ఈ ఆఫర్ ను తిరస్కరించారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నుష్రత్ భరుచ్చా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

నుష్రత్ హిందీలో 'ప్యార్ కా పంచ్‌నామా' 'ప్యార్ కా పంచ్‌నామా 2' 'సోనూ కే టిటు కి స్వీటీ' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అక్షయ్ కుమార్ నటించిన 'రామ్ సేతు' చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. దీంతో పాటుగా ఈ బ్యూటీ పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.

పెన్ స్టూడియోస్ - పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధవల్ జయంతిలాల్ గడ మరియు అక్షయ్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఒరిజినల్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తనీష్ బాగ్చి సంగీతం సమకూర్చగా.. నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

'ఛత్రపతి' అనేది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం. ఇప్పుడు హిందీలో వివి వినాయక్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.