Begin typing your search above and press return to search.

సుశాంత్ ర‌చ్చ‌ త‌ర్వాత న‌ట‌వార‌సుల‌ ప‌రిస్థితేమిటో?

By:  Tupaki Desk   |   20 Oct 2020 3:30 AM GMT
సుశాంత్ ర‌చ్చ‌ త‌ర్వాత న‌ట‌వార‌సుల‌ ప‌రిస్థితేమిటో?
X
బాలీవుడ్ లో మాఫియా నియంత్ర‌ణ‌.. ఇన్ సైడ‌ర్ .. ఔట్ సైడ‌ర్ టాపిక్స్ ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌లోని వారు వెలుప‌లి ప్ర‌తిభ‌ను తొక్కేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. నెపోటిజం (న‌ట‌వార‌సులు) పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేచింది. న‌ట‌వార‌సుల్ని కాపాడేందుకు బ‌య‌టి నుంచి వ‌చ్చిన ప్ర‌తిభావంతుల్ని ఎద‌గ‌నివ్వ‌కుండా బాలీవుడ్ మాఫియా కుట్ర‌లు పన్నుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

అయితే స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్న ప‌లువురు న‌ట‌వార‌సుల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ వార‌సులు ఇద్ద‌రూ ఇప్ప‌టికే తారాప‌థంలోకి దూసుకు రాబోతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ముందుగా షారూక్ వార‌సురాలు సుహానా ఇప్ప‌టికే తెర‌వెన‌క.. తెర‌ముందు ప్ర‌తిదీ శిక్ష‌ణ తీసుకుని బ‌రిలో దిగేందుకు రెడీ అవుతోంది. తాను క‌థానాయిక కావాల‌నుకుంటున్న విష‌యం ఇప్ప‌టికే బ‌హిరంగంగా తెలిసిన‌దే. అలాగే అంద‌గాడైన షారూక్ పుత్ర‌ర‌త్నం ఆర్య‌న్ ఖాన్ సైతం బాద్ షా లెగ‌సీని అందిపుచ్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ఆర్య‌న్ ఎప్పుడు హీరో అవుతాడు? అన్న‌దానిపై షారూక్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మ‌రోవైపు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వార‌సురాలు ఇరా ఖాన్ బాలీవుడ లో ప్ర‌యోగాల‌క సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌పై ఆస‌క్తి ఉంది. అలాగ‌ని న‌టి కాదా? అంటే చెప్ప‌లేం. ఇప్ప‌టికే స్టేజీ డ్రామాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనుభ‌వం త‌న‌కు ఉండ‌డంతో ఇరా ఖాన్ పెద్ద తెర‌పై ఎలాంటి ప్ర‌యోగాలు చేస్తుందోనన్న ఆస‌క్తి నెల‌కొంది.

ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో వ్య‌వ‌హారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సైఫ్ ఖాన్ న‌ట‌వారసురాలు‌ సారా అలీఖాన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఔట్ సైడర్ అయిన సుశాంత్ సింగ్ తో సారా ప్రేమ‌లో ప‌డ‌డ‌డం సైఫ్ -క‌రీనా జంట‌కు ఇష్టం లేద‌న్న‌ది వైర‌ల్ గా మారింది. సుశాంత్ ప్రేమ‌లో ప‌డిన విష‌యాన్ని సారా అంగీక‌రించ‌డంతో నెటిజ‌నులు సారాపై సీరియ‌స్ గానే ఉన్నారు. సైఫ్ న‌ట‌వార‌సుడు.. సారా అలీఖాన్ సోద‌రుడు ఇబ్ర‌హీం ఖాన్ కూడా హీరోగా రంగ ప్ర‌వేశం చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వ క‌పూర్ సోద‌రి త్వ‌ర‌లోనే బ‌రిలో దిగ‌నుంది. మ‌లైకా- ఆర్భాజ్ జంట కుమారుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. అయితే ప్ర‌స్తుత సందిగ్ధావ‌స్థలో వీళ్లంతా రంగ ప్ర‌వేశం చేయ‌డం స‌రైన‌దేనా? ఓవైపు న‌ట‌వార‌సుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుంటే వీళ్లంతా ఇండ‌స్ట్రీలో ల‌క్ చెక్ చేసుకోవాల‌ని ఆలోచించ‌డం క‌రెక్టేనా? అన్న చ‌ర్చా ఇప్పుడు మొదలైంది.