ఒక్క పాట... రచ్చ రచ్చ వివాదం

Sun Sep 25 2022 10:14:27 GMT+0530 (India Standard Time)

Bollywood Singer Neha Kakkar

బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ తాజాగా ఓ సజ్నా అనే సూపర్ హిట్ సాంగ్ రీ క్రియట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటకు నెగిటివ్ టాక్ వచ్చింది. సూపర్ క్లాసిక్ సాంగ్ ను నాశనం చేశారు అంటూ నేహా కక్కర్ ను తీవ్రంగా విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలోనే కాకుండా యూట్యూబ్ లో కూడా రచ్చ రచ్చగా వివాదం చెలరేగుతోంది.నేహా కక్కర్ తో పాటు ఈ పాటలో ప్రియాంక్ శర్మ మరియు ధనశ్రీలు కనిపిస్తున్నారు. పాట చిత్రీకరణ అంతా బాగానే ఉన్నా కూడా పాటను పాడిన తీరు మాత్రం అస్సలు బాగా లేదని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ పాట గురించి విమర్శలు చేస్తున్న జనాలతో పాటు ప్రముఖ గాయని ఫాల్గుణి పాఠక్ కూడా కాస్త సీరియస్ గానే స్పందించింది.

ఆ పాటకు సంబంధించిన లీగల్ హక్కులు నా వద్ద ఉండి ఉంటే తప్పకుండా పాటను ఇలా పాడు చేసినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకునేదాన్ని అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింతగా రాజేసినట్లుగా అయ్యింది. ఇప్పుడు వివాదం ఇద్దరు సింగర్స్ మధ్యకు వెళ్లి పోయింది.

సోషల్ మీడియా జనాల బ్యాడ్ కామెంట్స్ మరియు విమర్శలకు నేహా కక్కర్ కాస్త సీరియస్ గానే స్పందించింది. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇంత తక్కువ వయసులో ఇంత మంది అభిమానం ను దక్కించుకుంటారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు నన్ను అభిమానిస్తున్నారు... వారు నా యొక్క పాటలకు ఆనంద పడుతున్నారు. నా ప్రతిభ మరియు నా యొక్క కృషి గురించి ఎవరు అనుమానం వ్యక్తం చేయనక్కర్లేదు.

నేను కెరీర్ లో సక్సెస్ అవ్వడంను తట్టుకోలేని వారు... నేను సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేని వారు మాత్రమే నా పై బ్యాడ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారంటూ నేహా కక్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. దేవుడి ఆశీర్వాదం నాకు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇండియన్ ఐడల్ లో జడ్జ్ గా వ్యవహరించడం ద్వారా నేహా కక్కర్ కి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కింది.