Begin typing your search above and press return to search.

బాలీవుడ్ మ‌ద‌ర్ అండ్ డాట‌ర్ సెల్ఫీ

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:30 AM GMT
బాలీవుడ్ మ‌ద‌ర్ అండ్ డాట‌ర్ సెల్ఫీ
X
స్టార్ ‌ల వార‌సుల‌పై మీడియాతో పాటు సినీ ప్రియులు ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తుంటారు అన్న విష‌యం తెలిసిందే. అయితే దురాభిమానులు.. ట్రోల‌ర్స్ కూడా ఇక్క‌డ ఎక్కువే. న‌చ్చిందా ఆకాశానికి ఎత్త‌డం.. న‌చ్చ‌లేదా.. ట్రోలింగ్‌ తో హెరాష్ చేయ‌డం తెలిసిందే. స్టార్‌ లకే కాకుండా ఈ ఇబ్బంది స్టార్‌ల పిల్ల‌కు కూడా ఈ మ‌ద్య ఎక్కువైంది. స్టార్‌ల‌కు సంబంధించిన వారిని బాడీ షేమింగ్ గురించి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇటీవ‌ల బాలీవుడ్ హిట్ పెయిర్ జోడీ అజ‌య్ దేవ‌గ‌న్ , ..కాజోల్ ల ముద్దుల కూతురు నైసా దేవ‌గ‌న్‌ ని బాడీ షేమింగ్‌తో పాటు ఆమె క‌ల‌ర్‌ పై నెటిజ‌న్స్ చాలా మంది పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయ‌డం తెలిసిందే. ముందు చామ‌న ఛాయ‌లో వుండే నైసా ఆ త‌రువాత త‌ల్లి కాజోల్ క‌ల‌ర్‌లోకి మారిపోయింది. అప్ప‌టి నుంచి ట్రోలింగ్ త‌గ్గింది.

తాజాగా త‌ల్లీ.. కూతురు క‌లిసి స‌ర‌దాగా సెల్ఫీకి పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. అచ్చు త‌ల్లి కాజోల్ త‌ర‌హాలోనే క‌ల‌ర్‌ ఫుల్ ‌గా నైసా క‌నిపిస్తుండ‌టంతో విమ‌ర్శించిన నెటిజ‌న్సే లైక్ మ‌ద‌ర్ లైక్ డాట‌ర్ అంటూ కామెంట్‌ లు చేస్తున్నారు.