Begin typing your search above and press return to search.

బాలీవుడ్ వాళ్ళ బుర్రే బుర్ర అబ్బా...!!

By:  Tupaki Desk   |   14 Aug 2020 12:30 AM GMT
బాలీవుడ్ వాళ్ళ బుర్రే బుర్ర అబ్బా...!!
X
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి వల్ల బ్యాగ్రౌండ్ లేని వారిని తొక్కేస్తున్నారని.. అందుకే నెపోటిజం స్టార్స్ సినిమాలను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నెపోటిజం స్టార్స్ గా పిలవబడే యాక్టర్స్ నటించిన 'సడక్ 2' ట్రైలర్ విడుదల చేయబడి యూట్యూబ్‌ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇంతకుముందున్న రికార్డులన్నింటినీ చెరిపేసి కొత్త రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఇవి గొప్పగా చెప్పుకోవాల్సిన రికార్డులు కావు.. వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన రికార్డులు. సంజయ్‌ దత్ - అలియా భ‌ట్ - ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం 'స‌డ‌క్ 2'. ఆలియా భట్ తండ్రి‌ మహేష్ భ‌ట్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రపంచంలోనే అత్యధిక డిస్‌-లైక్‌ లు తెచ్చుకున్న వీడియోగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

కాగా 'సడక్ 2' మేకర్స్ ఇప్పుడు ఈ నెగిటివిటీ నుండి బయటపడే ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ దత్ ఆరోగ్యరీత్యా హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు 'సడక్ 2' ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడు సంజయ్ దత్ హెల్త్ ఇష్యూని కూడా వాడుకుంటున్నారు. సంజయ్ దత్ కి థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అని ఇటీవలే తెలిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని 'సడక్ 2' టీమ్ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. 'సడక్ 2' మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సంజయ్ దత్ కి కాన్సర్ వచ్చిందనే న్యూస్ హైలైట్ చేస్తున్నారట. బాలీవుడ్ వాళ్ళ బుర్రే బుర్ర అబ్బా. దేన్నైనా పబ్లిసిటీ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. ఇక 'సడక్ 2' చిత్రాన్ని ఈ నెల 28న డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 'జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్' అంటూ #UninstallHotstar హ్యాష్‌ ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో బాలీవుడ్ పబ్లిసిటీ స్టంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.