Begin typing your search above and press return to search.

బన్నీ డ్యాన్స్ కి ఫిదా అయిన బాలీవుడ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   31 March 2020 5:00 PM GMT
బన్నీ డ్యాన్స్ కి ఫిదా అయిన బాలీవుడ్ హీరోయిన్
X
దిశా పటానీ..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ. బాలీవుడ్ లో ధోని బయోపిక్, భాగీ 2, మలంగ్‌ సినిమాల తో మంచి పేరు తెచ్చుకున్నారు దిశా. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘రాధే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మళ్ళీ అవకాశాలు అందిపుచ్చుకోని ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వాళ్లకు కూడా బాగా టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టుల కోసం కుర్రకారు వెయిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీగా పెట్టిన పోస్టు ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ అందరు ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది.

అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటింటించిన 'అల వైకుంఠపురంలో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' సాంగ్ లోని ఒక బిట్ పోస్ట్ చేసింది. ర్యాంప్ మీద అల్లు అర్జున్ వేసే ఈ స్టెప్ కి 'ఇతను ఈ విధంగా డాన్స్ ఎలా చేస్తాడు' అని కామెంట్ పెట్టింది. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. దీనికి స్పందించిన అల్లు అర్జున్ 'నేను మ్యూజిక్ ని ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ నన్ను డాన్స్ చేసేలా చేస్తుంది, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్' అని కామెంట్ చేసాడు. వీరిద్దరి మధ్య సంభాషణ చూస్తుంటే ఫ్యూచర్ లో కలిసి నటిస్తారేమో అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఈ మధ్యే తన 17 ఏళ్ళ సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. గంగోత్రి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు తన సినిమాల ద్వారా బాగా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.