స్టార్ హీరోకి క్యాన్సర్?

Mon Dec 10 2018 17:11:48 GMT+0530 (IST)

Bollywood Hero Shahid Kapoor Suffering From Cancer

బాలీవుడ్‌లో కొత్త తరహా సినిమాలతో వేడి పెంచే హీరో షాహిద్ కపూర్. వరుస విజయాలతో ఊపుమీదున్న ఈ హీరో నటించిన `పద్మావత్` ఓ సంచలనం. తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరోకి క్యాన్సర్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. గత కొంత కాలంగా స్టమక్ క్యాన్సర్ తో షాహిద్ కపూర్ బాధపడుతున్నాడని  క్యాన్సర్ మొదటి స్టేజ్‌లోనే వుందని దీనికి సంబంధించిన రహ్యంగా ముంబైలో తను చికిత్స చేయించుకున్నాడని  వస్తున్నవార్తలు వైరల్ కావడంతో ఈ వార్తల పై కంగారు పడిన షాహిద్ తాజాగా స్పందించాడు.`నేను ఆరోగ్యంగానే వున్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తల్ని నమ్మకండి` అంటూ వివరణ ఇచ్చాడు. షాహీద్ కుటుంబం కూడా ఈ వార్తలపై స్పందించింది. `మీడియా వర్గాలు ఏ వార్తలు పడితే ఆ వార్తలు ఎలా రాస్తారు? ఏ విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని షాహీద్ పై వార్తలు రాస్తున్నారు మరోసారి ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తే ఊరుకునేది లేదని మండిపడింది.

తెలుగులో  సంచలన విజయం అందుకున్న `అర్జున్‌రెడ్డి` సినిమాను బాలీవుడ్‌లో షాహీద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `కబీర్ సింగ్` అనే పేరును ఖరారు చేశారు. టీసిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తతుం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. `అర్జున్ రెడ్డి` రీమేక్ తో షాహీద్‌కపూర్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం తపిస్తున్న వేళ తనకు క్యాన్సర్ అంటూ గాలి వార్తలు షికారు చేస్తుండటం జీర్ణించుకోలేకపోతున్నాడని ఇలాంటి వార్తల్ని బాలీవుడ్ ఎంకరేజ్ చేయదని బాలీవుడ్ బిగ్గీస్ షాహీద్ కు బాసటగా నిలుస్తున్నారట.